Viral Video: విమానాశ్రయంలో ఎయిర్ హోస్టెస్ స్టెప్పులకు నెటిజన్ల ప్రశంసలు.. వైరల్ అవుతున్న వీడియో
ఇటీవల సినిమాల్లో బాగా హిట్ అయిన పాటలకు, ప్రైవేటు పాటలకు కూడా నెటిజన్లు తమదైన స్టయిల్లో స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీరిలో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. వాటిని నెటిజన్లు కూడా బాగా ఇష్టపడుతున్నారు కూడా.
ఇటీవల సినిమాల్లో బాగా హిట్ అయిన పాటలకు, ప్రైవేటు పాటలకు కూడా నెటిజన్లు తమదైన స్టయిల్లో స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వీరిలో సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా ఉండటం విశేషం. వాటిని నెటిజన్లు కూడా బాగా ఇష్టపడుతున్నారు కూడా. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇండిగో ఎయిర్ హోస్టెస్ హిందీ పాటకి డ్యాన్స్ చేసి చాలా ఫేమస్ అయింది. తాజాగా స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ ఉమా మీనాక్షి కూడా ఓ హిందీ పాటకు అదిరిపోయే డ్యాన్స్ చేసి నెటిజన్ల నుంచి ప్రశంసలు అందుకుంటుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ ఎయిర్ హోస్టెస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.వీడియోలో ఉమా మీనాక్షి అనే స్పైస్‌జెట్ ఎయిర్ హోస్టెస్ విమానాశ్రయంలో హిందీ పాటకి అందంగా స్టెప్పులేస్తుంది. ఎరుపు రంగు యూనిఫాం ధరించి సూపర్ స్టెప్స్ వేసి నెటిజన్లని బాగా అలరించింది. ఆమె డ్యాన్స్ చేసిన విధానం అందరికి బాగానచ్చింది. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌కి అందరు ఫిదా అయ్యారు. దీంతో ఈ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. మిలియన్‌కి పైగా వీక్షకులు ఈ వీడియోను వీక్షించారు. అంతేకాదు నెటిజన్లు ఉమా డ్యాన్స్ మామూలుగా లేదంటూ ప్రశంసిస్తున్నారు. ఆమె ఎక్స్‌ప్రెషన్స్‌ని అదిరిపోయాయని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే… ఇంకొకరు “సూపర్ డ్యాన్స్” అని రాసారు. ఇలా నెటిజన్లు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..