No Cost EMI: నో కాస్ట్ ఈఎంఐలతో ఎలాంటి లాభం ఉంటుంది..? ఇదంతా ప్లానేనా..?
No Cost EMI: ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువులను కొనుగోలు చేసినట్లయితే నో కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) ఆఫర్లు ఉంటాయి. వడ్డీ లేని రుణంతో వస్తువులను కొనుగోలు
No Cost EMI: ప్రస్తుతం ఆన్‌లైన్‌లో ఏదైనా వస్తువులను కొనుగోలు చేసినట్లయితే నో కాస్ట్ ఈఎంఐ (No Cost EMI) ఆఫర్లు ఉంటాయి. వడ్డీ లేని రుణంతో వస్తువులను కొనుగోలు చేసే సదుపాయం ఇందులోనే ఉంటుంది. దీనిని చూసిన జనాలు ఎగబడి కొనుగోలు చేస్తుంటారు. కానీ ధరలోనే వడ్డీ మొత్తాన్ని కూడా కలిపి విక్రయిస్తారన్న విషయం పెద్దగా గుర్తించము. అసలుతో వడ్డీని కలిపి రుణ కాలపరిమితికి తగ్గట్టుగా EMIలను నిర్ణయిస్తారు. అసలు జీరో వడ్డీ రుణాలే లేవని RBI చెబుతోంది. వడ్డీ మొత్తాన్ని కూడా ఉత్పత్తి ధరలో కలిపి అమ్మడమే జీరో కాస్ట్ ఈఎంఐ స్కీమ్‌ల ప్లాన్ అని ఓ సర్క్యూలర్‌లో స్పష్టం చేసింది.
ఇలాంటి విషయాలను ముందుగానే తెలుసుకోవడం మంచిది. లేకపోతే మనకు తెలియకుండానే మన నుంచి వడ్డీని వసూలు చేస్తారు. ఉదాహరణకు ఒక ఉత్పత్తిలో రూ.50వేలు ఉంటే.. దీనిని మీరు నగదు చెల్లించి కొనుగోలు చేస్తే మీకు డీలర్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తాడు. కానీ దానినే ఈఎంఐలో కొనుగోలు చేస్తే ఈ డిస్కౌంట్ ఉండదు. సదరు డిస్కౌంట్ మొత్తాన్ని వడ్డీకి సమానంగా ఉండేలా చూసుకుంటారు.
నియమ నిబంధనలు తెలుసుకోండి..
అలాగే నోకాస్ట్ ఈఎంఐ నియమ నిబంధనలను తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు నిపుణులు. మీరు పెట్టుకునే ఈఎంఐ ఆప్షన్‌లో ప్రాసెసింగ్ ఫీజు, ప్రీ క్లోజర్ చార్జీలు, కాలపరిమితి ఇవన్ని పరిశీలించడం మంచిదంటున్నారు. నో కాస్ట్ ఈఎంఐతో కొనుగోలు చేసే ముందు వివిధ డీలర్ల వద్ద ధరల తేడాలను గుర్తించడం మంచిది. నేరుగా నగదుతో కొనుగోలు చేయడానికి, ఈఎంఐలతో కొనుగలు చేయడానికి మధ్య ఉన్న తేడాలను గుర్తించడండి.
ఇవి కూడా చదవండి