Shocking Viral Video: బాత్రూమ్‌లో దాక్కున్న ప్రియురాలు.. ముఖం పగలగొట్టిన ప్రియుడు.. నవ్వొచ్చిన నవ్వలేని వైరల్ వీడియో...

Shocking Viral Video: బాత్రూమ్‌లో దాక్కున్న ప్రియురాలు.. ముఖం పగలగొట్టిన ప్రియుడు.. నవ్వొచ్చిన నవ్వలేని వైరల్ వీడియో…

Anil kumar poka

|

Updated on: Feb 24, 2022 | 9:33 AM

ప్రతిరోజు సోషల్‌ మీడియాలో అనేకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లుకూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో బాత్రూమ్‌లో దాక్కున్న గర్ల్‌ఫ్రెండ్‌పై ప్రియుడు పంచ్‌లు కురిపిస్తాడు.


ప్రతిరోజు సోషల్‌ మీడియాలో అనేకరకాల వీడియోలు వైరల్‌ అవుతుంటాయి. నెటిజన్లుకూడా వాటిని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. తాజాగా సోషల్‌ మీడియాలో ఒక వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఇందులో బాత్రూమ్‌లో దాక్కున్న గర్ల్‌ఫ్రెండ్‌పై ప్రియుడు పంచ్‌లు కురిపిస్తాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు. ఇంతకీ అతడు ప్రియురాలిని ఎందుకు కొట్టాడంటే… వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక అమ్మాయి బాత్రూమ్‌లో కర్టెన్‌ వెనుక దాక్కుంటుంది. అప్పుడే ఆమె ప్రియుడు బాత్రూమ్‌కి వస్తాడు. అప్పుడు కర్టెన్‌ వెనుక ఉండి అతడిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అతను కర్టెన్‌ వెనుక ఎవరో దొంగ ఉన్నాడనుకొని కర్టెన్‌ తొలగించకుండానే అతడు పిడికిలితో గుద్దుతాడు.. దీంతో కర్టెన్‌ వెనుక ఉన్న ఆమె ముక్కు పగిలిపోతుంది. తర్వాత అక్కడ ఉన్నది తన ప్రియురాలే అని తెలుసుకొని సారీ చెబుతూ కొట్టినందుకు క్షమాపనులు కోరుతాడు. కొద్దిసేపు ఆమెని ఓదార్చుతాడు. వాస్తవానికి ఆ అమ్మాయి అతడిని ఆటపట్టించాలని అనుకుంది. కానీ సీన్‌ రివర్స్‌ అయి ఆమే ప్రియుడి చేతిలో దెబ్బలు తినాల్సి వచ్చింది పాపం. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. కామెంట్లు, షేర్స్‌తో హోరెత్తిస్తున్నారు. ఒక నెటిజన్‌ ఇలా అన్నాడు ప్రాంక్‌ వీడియోలు చేసేవారికి తగిన శాస్త్రి జరిగిందన్నాడు. మరొకరు ఆ మహిళ పరిస్థితి ఏంటని ప్రశ్నించాడు. ఇంకొకరు చిలిపి పనులు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలంటూ సలహా ఇచ్చాడు.

మరిన్ని చూడండి ఇక్కడ:

Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..