Viral Video: ఒకేసారి ఆరు ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తున్న వ్యక్తి.. ఎలా సాధ్యం అనుకుంటున్నారా..? అయితే ఈ వీడియో చూడాల్సిందే..
ఒక్క ఉద్యోగం చేయడానికే కొంతమంది ముప్పు తిప్పలు పడుతుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఆరు ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తున్నాడు. అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా... ఇది నిజం. యూరప్‌కు చెందిన ఓ రెడిట్ యూజర్..
ఒక్క ఉద్యోగం చేయడానికే కొంతమంది ముప్పు తిప్పలు పడుతుంటారు. కానీ.. ఓ వ్యక్తి మాత్రం ఏకంగా ఆరు ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తున్నాడు. అన్నీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్సే. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా… ఇది నిజం. యూరప్‌కు చెందిన ఓ రెడిట్ యూజర్.. తాను ఆరు కంపెనీలలో ఉద్యోగాలు చేస్తున్నట్టు ప్రకటించాడు. అంటే ఆరు ఫుల్ టైమ్ జాబ్స్ అన్నమాట. ఐటీ కంపెనీలో పని చేసే అతడు.. కరోనా మహమ్మారి వల్ల ఇతర ఉద్యోగాలు కూడా చేయాల్సి వచ్చిందట. దీంతో ఆరు ఉద్యోగాలు చేయడం మొదలు పెట్టాడు. 2022 సంవత్సరంలో ఆ ఉద్యోగాల ద్వారా 5.27 కోట్లు సంపాదించబోతున్నారట.వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అతనికి ఎక్కువ ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చిందని చెబుతున్నాడు. మిలియనీర్ కావడమే తన లక్ష్యమట. అందుకే ఇన్ని కంపెనీల్లో వర్క్ చేస్తున్నాడట. ఆఫీస్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు కాబట్టి.. ఆరు కంపెనీలను మేనేజ్ చేయగలుగుతున్నానని చెబుతున్నాడు. 40 ఏళ్లకే రిటైర్ అవ్వాలనేది అతని గోల్ అట. ఈ విషయాన్ని అతను తన రెడిట్ ఖాతా ద్వారా చెప్పుకొచ్చాడు.ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. నిజంగానే నువ్వు ఆరు ఉద్యోగాలు చేస్తున్నావా. అదెలా సాధ్యం. అవి కాంట్రాక్ట్ జాబ్స్ కావచ్చు. ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేస్తున్నావా ఏంటి.. మాకు కూడా కొన్ని టిప్స్ ఇవ్వొచ్చు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..