Viral Video: ఇదేం మాస్ ఐడియా..! అక్కడ పేరు చెప్పగానే.. కోరిన ఫుడ్ క్షణాల్లో ప్రత్యక్షం.. వైరల్ అవుతున్న వీడియో
మనం బాగా ఆకలి వేసి ఏ రెస్టారెంట్‌కో వెళ్లామనుకోండి. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అది ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు తింటామా అని ఎదురు చూస్తుంటాం. ఆర్డర్ చేసిన పావుగంట... అరగంట వరకూ ఫుడ్ టేబుల్ మీదకు రాదు... కానీ ఇక్కడ మాత్రం మీరు కోరుకున్న ఫుడ్ ఆర్డర్ చేసిన క్షణంలో మీ ముందు ప్రత్యక్షమైపోతుంది.
మనం బాగా ఆకలి వేసి ఏ రెస్టారెంట్‌కో వెళ్లామనుకోండి. ఫుడ్ ఆర్డర్ చేసిన తర్వాత అది ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు తింటామా అని ఎదురు చూస్తుంటాం. ఆర్డర్ చేసిన పావుగంట… అరగంట వరకూ ఫుడ్ టేబుల్ మీదకు రాదు… కానీ ఇక్కడ మాత్రం మీరు కోరుకున్న ఫుడ్ ఆర్డర్ చేసిన క్షణంలో మీ ముందు ప్రత్యక్షమైపోతుంది. ఏది కావాలంటే దానిని క్షణాల్లో ప్రత్యక్షం చేసే అక్షయ పాత్ర గురించి పురాణాల్లో వినే ఉంటారు. కానీ, ఆహార పదార్థం పేరు చెప్పగానే క్షణాల్లో మీ టేబుల్ మీద ఉంచే హోటల్ గురించి విన్నారా? మెక్సికోలో ఇలాంటి హోటలే ఒకటి ఉంది. పేరు ‘కర్నే గారిబాల్డీ’ ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఫుడ్ సర్వ్ చేసే హోటల్. ఆర్డర్ ఇచ్చిన 13.5 సెకన్లలో ఆహారాన్ని సర్వ్ చేసి ఈ మధ్యనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డుల్లోనూ తన పేరు నమోదు చేసుకుంది. ఎంత పెద్ద ఆర్డర్ అయినా సరే, వంటగది నుంచి కస్టమర్ టేబుల్ మీదకు చేర్చడానికి గరిష్ఠంగా 15 సెకన్ల కంటే ఆలస్యం అవదు. దాదాపు 1996 నుంచి ఈ హోటల్ అత్యంత వేగంగా ఫుడ్ సర్వ్ చేస్తూనే ఉందట. ఈ రికార్డును బ్రేక్ చేయడానికి చాలా మంది పెద్ద పెద్ద ఆర్డర్లు ఇస్తూ విఫలయత్నం చేశారట. ‘సాధారణంగా మెక్సికన్ వంటకాలు చేయడానికి చాలా సమయం పడుతుంది. అందుకే, ఆ ఆలస్యం ఆహారాన్ని అందించడంలో ఉండకూడదనుకున్నాం. ఇందుకు మా సిబ్బంది కూడా తోడ్పడటంతో ఈ రికార్డు సాధించగలిగాం’ అని చీఫ్ మేనేజర్ డేనియల్ ఫ్లోర్స్ తెలిపారు. ఇలాంటి హోటల్స్ మన ప్రాంతంలోకి ఎప్పుడు వస్తాయో అంటున్నారు నెటిజన్లు..
మరిన్ని చూడండి ఇక్కడ:
Syed Sohel Ryan: ట్రెండ్ మారింది..! స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న బిగ్ బాస్ ఫేమ్ ‘సోహెల్’..