kacha badam song trend: కచా బాదం పాటను ఇలా ట్రై చేయండి.. నెటిజన్లకు కొరియోగ్రాఫర్‌ ఛాలెంజ్‌.. ట్రెండ్ అవుతున్న వీడియో...

kacha badam song trend: కచా బాదం పాటను ఇలా ట్రై చేయండి.. నెటిజన్లకు కొరియోగ్రాఫర్‌ ఛాలెంజ్‌.. ట్రెండ్ అవుతున్న వీడియో…

Anil kumar poka

|

Updated on: Feb 24, 2022 | 9:09 AM

సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటినుంచి ప్రతి విషయం ట్రెండ్‌గా మారుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‏కు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్‌ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇటీవల వీధుల్లో శనక్కాయలు అమ్ముకునే వ్యక్తి శనక్కాయలు....


సోషల్ మీడియా విస్తృతి పెరిగినప్పటినుంచి ప్రతి విషయం ట్రెండ్‌గా మారుతోంది. ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్‏కు జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. సోషల్‌ మీడియా పుణ్యమా అని సామాన్యులు సైతం సెలబ్రిటీలుగా మారుతున్నారు. ఇటీవల వీధుల్లో శనక్కాయలు అమ్ముకునే వ్యక్తి శనక్కాయలు అమ్ముకునే క్రమంలో కస్టమర్లను ఆకర్షించేందుకు తాను పాడుకున్న పాట ట్రెండ్‌ సృష్టించింది. సామాన్యులనుంచి సెలబ్రిటీలు కూడా ఆ పాటకు స్టెప్పులేస్తూ నెట్టింట పోస్ట్‌ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ పాట సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది. ఇప్పుడు ఎక్కడ విన్నా.. చూసిన ఈ పాటకు నెటిజన్స్ స్టెప్పులేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కచా బాదం పాటకు కాలు కదిపారు.కొరియోగ్రాఫర్ గణేష్ మాస్టర్ ఇటీవల అల్లు అర్జున్.. రష్మిక మందన్న నటించిన పుష్ప సినిమాలోని పాటలకు కొరియోగ్రఫి చేశారు.. అందులో సమంత నటించిన స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావ.. ఊహు అంటావ పాటకు గణేష్ మాస్టర్ కొరియోగ్రాఫి చేశారు. ఈ పాట నెట్టింట్లో తెగ ఫేమస్ అయ్యింది. ఇప్పుడు గణేష్ మాస్టర్ సోషల్ మీడియాలో తెగ ఫేమస్ అయిన కచా బాదం పాటకు డాన్స్ చేసి తనలాగే స్టెప్పులేయాలంటూ ఫాలోవర్లకు ఛాలెంజ్ విసిరారు. ఈ వీడియోకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోపై మీరు ఓ లుక్కెయ్యండి..

మరిన్ని చూడండి ఇక్కడ: