AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ukraine- Russia Crisis: యుద్ధ మేఘాల మధ్య ఆరు భాషల్లో రిపోర్టింగ్‌.. అమెరికన్‌ రిపోర్టర్‌ పనితీరుకు ముగ్ధులవుతోన్న నెటిజన్లు..

ఇప్పుడు ప్రపంచ దృష్టంతా ర‌ష్యా- ఉక్రెయిన్‌ దేశాలపైనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారి తీస్తాయా? లేక ఇరుదేశాల మధ్య రాజీ కుదిరి అంతా సర్దుకుంటుందా? అని ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూస్తోంది.

Ukraine- Russia Crisis: యుద్ధ మేఘాల మధ్య ఆరు భాషల్లో రిపోర్టింగ్‌.. అమెరికన్‌ రిపోర్టర్‌ పనితీరుకు ముగ్ధులవుతోన్న నెటిజన్లు..
American Reporter
Basha Shek
| Edited By: |

Updated on: Feb 24, 2022 | 9:34 AM

Share

ఇప్పుడు ప్రపంచ దృష్టంతా ర‌ష్యా- ఉక్రెయిన్‌ దేశాలపైనే ఉంది. ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు యుద్ధానికి దారి తీస్తాయా? లేక ఇరుదేశాల మధ్య రాజీ కుదిరి అంతా సర్దుకుంటుందా? అని ప్రపంచమంతా ఆసక్తితో ఎదురుచూస్తోంది.ఈక్రమంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్‌ తెలుసుకునేందుకు చాలామంది వార్తా ఛానళ్లనే ఆధారపడుతున్నారు. అందుకు తగ్గట్లే వివిధ వార్తా ఛానళ్ల రిపోర్టర్లు యుద్ధ క్షేత్రం నుంచే ఎక్స్‌క్లూజివ్‌ విజువల్స్, వార్తలను అందించేందుకు కృషి చేస్తున్నారు. ఈనేపథ్యంలో అమెరికాకు చెందిన రిపోర్టర్‌కు చెందిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరలవుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ నుంచి లైవ్‌ రిపోర్టింగ్ చేస్తోన్న అతడు.. ఆరు భాషల్లో సమాచారం అందించడమే దీనికి కారణం.

కాగా ఆ రిపోర్టర్‌ పేరు ఫిలిప్ క్రాథ‌ర్‌. ఈయ‌న ఫిలిప్ అసోసియేటెడ్ ప్రెస్ గ్లోబ‌ల్ మీడియాకు ఆన్‌లైన్ రిపోర్టర్‌గా ప‌నిచేస్తున్నాడు. ప్రస్తుతం అతను కీవ్‌లోనే ఉంటూ అక్కడి నుంచే ఇత‌ర మీడియా సంస్థలకు కూడా ప‌నిచేస్తున్నాడు. మొత్తం ఆరు ర‌కాల భాష‌ల్లో ఎప్పటిక‌ప్పుడు జ‌రుగుతున్న అంశాల‌ను ఆయా వార్తా ఛానళ్లకు సమాచారం అందిస్తున్నారు. ఇంగ్లిష్‌, ల‌గ్జంబ‌ర్గ్‌, స్పానిష్‌, పోర్చుగ్రీస్‌, ఫ్రెంచ్‌, జ‌ర్మనీ.. ఇలా ఆరు భాష‌ల్లో రిపోర్టింగ్ చేస్తున్న ఫిలిప్‌..’ఈ ఉద్రిక్త పరిస్థితుల గురించి కీవ్ నుంచి ఆరు భాషల్లో రిపోర్టు చేశాను’ అంటూ తన వీడియోను షేర్ చేశారు. ఇందులో తాను మాట్లాడిన భాషల వరుస క్రమాన్ని కూడా ఉంచారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ‘ఆరు భాషలు మాట్లాడేవారు ఉన్నారని తెలుసు. కానీ, ఇలా ఆరు భాషల్లో లైవ్‌ రిపోర్టింగ్‌ను చేసినవారిని నేను ఇంతవరకు చూడలేదు. అమేజింగ్‌ రిపోర్టింగ్‌’ అంటూ చాలామంది రిపోర్టర్లు ఫిలిప్‌ ధైర్యంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Also Read:Andhra Pradesh: ఘరానా ముఠా బీభత్సం.. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే భారీ చోరీ.. ఇంతకీ ఏం ఎత్తుకుపోయారంటే..

Ys Viveka: మరో టర్న్ తీసుకున్న వైఎస్ వివేకా హత్య కేసు.. వెలుగులోకి ఊహించని ట్విస్టులు..

Statue of Equality: సమతాస్ఫూర్తి కేంద్ర సందర్శకులకు అనుమతి.. టైమింగ్స్ ఇవే..

తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
కృష్ణ, మహేష్‌ నో చెప్పారు.. సూపర్ హిట్ కొట్టిన స్టార్ డైరెక్టర్!
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
క్యాబ్ రద్దు చేస్తే కఠిన చర్యలే.. న్యూ ఇయర్ వేళ పోలీసుల రూల్స్
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
Horoscope Today: ఆ రాశి నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందుతుంది..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
శ్రీశైలంలో వారికి దర్శనం ఫ్రీ.. వసతి కూడా ఉచితంగానే..
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
మన అమ్మాయిలు అదరహో..ఐదుకి ఐదు కొట్టి హిస్టరీ క్రియేట్ చేశారుగా!
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్
బంగారం ధరల్లో ఊహించని మార్పులు.. రూ.6 వేలు డౌన్
పాలు - అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు..
పాలు - అరటిపండు కలిపి తింటే ఏమవుతుంది.. అసలు వాస్తవాలు..