Andhra Pradesh: ఘరానా ముఠా బీభత్సం.. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే భారీ చోరీ.. ఇంతకీ ఏం ఎత్తుకుపోయారంటే..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Feb 23, 2022 | 11:45 PM

Andhra Pradesh: నగరం నడిబొడ్డు, పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరాన ఉన్న బంగారు షాపులో భారీ చోరీ సంచలనం రేపుతోంది. దుకాణం మొత్తం ఖాళీ చేసింది దొంగల ముఠా.

Andhra Pradesh: ఘరానా ముఠా బీభత్సం.. పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే భారీ చోరీ.. ఇంతకీ ఏం ఎత్తుకుపోయారంటే..

Andhra Pradesh: నగరం నడిబొడ్డు, పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరాన ఉన్న బంగారు షాపులో భారీ చోరీ సంచలనం రేపుతోంది. దుకాణం మొత్తం ఖాళీ చేసింది దొంగల ముఠా. విజయనగరంలో బంగారం చోరీ కలకలం రేపుతోంది. గంటస్థంభం దగ్గరలోని రవి జ్యూయలరీ షాపును లూటీ చేశారు. షాపులోకి దూరిన దొంగలు..ఐదు కిలోల బంగారం సహా వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు. జ్యూయలరీ దుకాణం వద్ద ఉన్న ఇనుపగేటును కోసి మరీ షాపును లూటీ చేశారు. వన్‌ టౌన్‌, సీసీఎస్‌ పోలీసు స్టేషన్లకు కూతవేట దూరంలోనే ఈ జ్యూయలరీ దుకాణం ఉంది. యజమాని కోట రాజమోహన్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు. రవి జ్యూయలరీ షాపు యజమాని నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్లూస్‌ టీంతో ఆధారాలను సేకరిస్తున్నారు. పరిసర ప్రాంతాలను తనిఖీ చేశారు పోలీసులు. దుకాణానికి ఉన్న మొత్తం మూడు గేట్లలో పెద్ద గేటుకు కన్నం పెట్టి లోపలికి చొరబడినట్లు గుర్తించారు పోలీసులు. సీసీ కెమెరాల్లో కనపడకుండా కెమెరాలను తిప్పి షాపును లూటీ చేసినట్లు చెబుతున్నారు. ఈ చోరీ అంతర్‌రాష్ట్ర ముఠా పనేనని పోలీసులు భావిస్తున్నారు. నగరం నడిబొడ్డునే దొంగలు చెలరేగిపోవడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు మరింత భద్రత కల్పించాలని కోరుతున్నారు.

Also read:

Andhra Pradesh: రష్యా-ఉక్రేయిన్ ఉద్రిక్తత.. కేంద్రానికి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్.. ఎందుకోసమంటే..

Ys Viveka: మరో టర్న్ తీసుకున్న వైఎస్ వివేకా హత్య కేసు.. వెలుగులోకి ఊహించని ట్విస్టులు..

Andhra Pradesh: టిఫిన్ చేసి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడు.. తెల్లారేసరికి శవమై వచ్చాడు.. ఇంతలో ఏం జరిగిందంటే..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu