Andhra Pradesh: రష్యా-ఉక్రేయిన్ ఉద్రిక్తత.. కేంద్రానికి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్.. ఎందుకోసమంటే..

Andhra Pradesh: ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ద వాతావరం నేపథ్యంలో భారత్ కు చెందిన విద్యార్థులను కేంద్రం ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంది.

Andhra Pradesh: రష్యా-ఉక్రేయిన్ ఉద్రిక్తత.. కేంద్రానికి లేఖ రాసిన ఏపీ సీఎం జగన్.. ఎందుకోసమంటే..
Cm Jagan
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 23, 2022 | 11:42 PM

Andhra Pradesh: ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ద వాతావరం నేపథ్యంలో భారత్ కు చెందిన విద్యార్థులను కేంద్రం ప్రభుత్వం వెనక్కి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంది. ఇప్పటికే విద్యార్థులను భారత్ కు తరలిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. ఉక్రెయిన్‌లో ఉన్న ఏపీ వాసులను సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు జగన్. ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎం ప్రశంసించారు. ఏపీ కి చెందిన విద్యార్థులు సైతం ఉక్రెయిన్ లో ఉన్నారని, వారిని క్షేమంగా దేశానికి తీసుకొచ్చేందుకు సహాయం చేయాలని కేంద్ర మంత్రి జైశంకర్ ను కొరారు . ఉక్రెయిన్‌లో భారత్ ఎంబసీని ఏపీ విద్యార్థులు సంప్రదించాలని సూచించారు సీఎం జగన్. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఏపీ విద్యార్థులకు సంబంధించిన వివరాలను ఆరా తీస్తున్నట్లు సీఎం చెప్పారు. విద్యార్థులను సురక్షితంగా పంపేందుకు కృషి చేయాలని లేఖలో కోరారు. ఏపీ ప్రభుత్వం నిత్యం కేంద్ర విదేశాంగశాఖతో టచ్‌లో ఉందని తెలిపారు. వాళ్లని వెనక్కి తీసుకురావడంలో కావాల్సిన సహకారం కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌, ఇక్కడి సీఎంవో అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఉక్రెయిన్‌లోని ఏపీ విద్యార్థులతో ప్రభుత్వం టచ్‌లో ఉందన్నారు. కేంద్రం సూచించిన మేరకు వారంతా వెనక్కి రావడానికి తమ వంతు సహకారం అందిస్తున్నామని సీఎం వైఎస్‌ జగన్‌ లేఖలో తెలిపారు.

Also read:

Ys Viveka: మరో టర్న్ తీసుకున్న వైఎస్ వివేకా హత్య కేసు.. వెలుగులోకి ఊహించని ట్విస్టులు..

Andhra Pradesh: టిఫిన్ చేసి వస్తానని ఇంట్లో నుంచి వెళ్లాడు.. తెల్లారేసరికి శవమై వచ్చాడు.. ఇంతలో ఏం జరిగిందంటే..

UP Election 2022: యూపీలో ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే..