Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Election 2022: యూపీలో ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే..

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా యూపీలో నాలుగో విడత పోలింగ్ ముగిసింది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.

UP Election 2022: యూపీలో ప్రశాంతంగా ముగిసిన నాలుగో విడత పోలింగ్.. ఫలితాలు ఎప్పుడంటే..
Up Elections (3)
Follow us
Sanjay Kasula

|

Updated on: Feb 23, 2022 | 11:10 PM

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో(5 State Elections 202) భాగంగా యూపీలో నాలుగో విడత పోలింగ్(UP Assembly Election 2022 Phase 4 Voting) ముగిసింది. ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగియడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. పిలిభిత్, లఖింపూర్ ఖేరీ, సీతాపూర్, హర్దోయ్, ఉన్నావ్, లక్నో, రాయ్ బరేలీ, బందా, ఫతేపూర్ జిల్లాల్లోని మొత్తం 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఈ దశలో మొత్తం 624 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఉదయం 7 గంటలకే ఓటు వేయడానికి క్యూ లైన్ లో నిలిచి ఉన్నారు. దీంతో భారీగా ఓటింగ్ శాతం నమోదవుతుందని అంచనా వేసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 57.45 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 2017 ఎన్నికల్లో 62.55 శాతం పోలింగ్ నమోదు కాగా… 2019లో 60.03 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 2.3 కోట్ల మంది ఓటర్లున్నారు. వీరిలో 1.14 కోట్ల మంది పురుషులుంటే..99.3 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. మొత్తం 13 వేల 817 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

యూపీలో గెలిచి తీరాలని బీజేపీ, ఎస్పీ పోటీ పడుతున్నాయి. దీంతో ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. ప్రచారం కూడా అదే స్థాయిలో జరిగింది. ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండడంతో రాజకీయాలు రంజుగా మారాయి. బీజేపీ వైఫల్యాలను ఎస్పీ కూటమి ప్రస్తావిస్తూ.. ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ బీజేపీ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. బీఎస్పీ అధినేత మాయావతి అనేక ర్యాలీలు నిర్వహించారు. ఎస్పీ,బీజేపీ, కాంగ్రెస్‌లను తిరస్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. బీఎస్పీ మాత్రమే రాష్ట్ర ప్రజలకు నిజమైన సుపరిపాలన అందించగలదని అన్నారు. కాంగ్రెస్ కూడా ప్రచారం ముమ్మరంగా చేపడుతోంది. పార్టీ ఉత్తర్ ప్రదేశ్ ఇన్ చార్జి ప్రియాంక గాంధీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Chicken Changezi Recipe: చికెన్ ఇలా వండితే.. మొత్తం మీరే తినేస్తారు.. ఎలా చేయాలో నేర్చుకోండి..

Viral Video: కచోడీ కొనేందుకు ట్రైన్​ఆపిన డ్రైవర్.. సోషల్ మీడియాలో వీడియో వైరల్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..