UP Elections: గౌతమ బుద్ధుడిని అవమానించిన అఖిలేష్ యాదవ్! కేశవ్ మౌర్య ట్వీట్‌తో వైరల్ అవుతున్న వీడియో
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయాలు కూడా అదే స్థాయిలో ముదురుతున్నాయి. తాజాగా ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కొత్త వివాదంలో చిక్కుకున్నారు.

Uttar Pradesh Assembly Elections: ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో రాజకీయాలు కూడా అదే స్థాయిలో ముదురుతున్నాయి. తాజాగా యూపీ రాజకీయాల్లోకి గౌతమబుద్ధుడి(Bhagwan Gautam Buddha) అంశాన్ని తీసుకువచ్చారు అధికార భారతీయ జనతా పార్టీ(BJP).. సమాజ్‌వాదీ పార్టీ(SP)ల నేతలు. భగవాన్ గౌతమ బుద్ధుడిని అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) అవమానించారని బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య ఈ వీడియోను ట్వీట్ చేస్తూ అఖిలేష్ యాదవ్ భగవాన్ గౌతమ బుద్ధుడిని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారని ప్రశ్నించారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రసంగంలో అఖిలేష్ యాదవ్ తీరుపై మండిపడ్డారు. భగవంతుడి కంటే వెండిపైనే అఖిలేష్‌కు మోజు ఎక్కువ అని చురకలు అంటించారు.
కేశవ్ ప్రసాద్ మౌర్య 7 సెకన్ల వీడియోను ట్వీట్ చేశారు. ఆ వీడియోలో అఖిలేష్ యాదవ్ ఎన్నికల ప్రచార వేదికపై కనిపిస్తున్నారు. ఆయనకు పార్టీ అభిమానులు భగవంతుడు గౌతమ బుద్ధుని విగ్రహాన్ని బహుకరించారు. దానిని పక్కన పెట్టాలని చూపిస్తూ కనిపించారు. అటువంటి పరిస్థితిలో, కేశవ్ ప్రసాద్ మౌర్య వీడియోను ట్వీట్ చేస్తూ, అఖిలేష్ యాదవ్‌ను మీరు గౌతమ బుద్ధుడిని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారని ప్రశ్నించారు. “అఖిలేష్ యాదవ్ జీ మీరు తథాగత గౌతమ బుద్ధుడిని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారు, కొత్త సమాజ్ వాదీ పార్టీ పాత్ర కూడా ఇదేనా!” అని ఆయన ట్వీట్‌లో రాశారు.
श्री अखिलेश यादव जी भगवान तथागत गौतम बुद्ध से इतनी नफ़रत क्यों करते हो,क्या यह भी नई सपा का चरित्र है ! pic.twitter.com/tZJIbK4LC4
— Keshav Prasad Maurya (@kpmaurya1) February 22, 2022
ఇదిలావుంటే, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం కౌశాంబిలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఈ ఘటనను ప్రస్తావించి అఖిలేష్ యాదవ్‌పై విరుచుపడ్డారు. ఈ దారుణమైన కుటుంబ సభ్యులు దళితులను ఎలా తింటున్నారో ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోందని ప్రధాని అన్నారు. ఈ విపరీతమైన కుటుంబీకులకు గౌతమ బుద్ధుని విగ్రహాన్ని అంగీకరించడం కూడా సరికాదని ఆయన అన్నారు. అతనికి బుద్ధుని విగ్రహాన్ని తీయాలని అనిపించలేదు. కానీ వెండి కిరీటాన్ని చూడగానే అతని నోటిలో నీరు నిండిపోయి… దానిని పట్టుకున్నారని ప్రధాని మోడీ ఎద్దేవా చేశారు.
మంగళవారం కౌశాంబిలోని సిరతులో అఖిలేష్ యాదవ్ బహిరంగ సభ నిర్వహించారు. అదే సమయంలో, అతనికి వేదికపై భగవాన్ గౌతమ బుద్ధుని విగ్రహాన్ని బహూకరించారు. అతను దానిని పక్కన పెట్టమని (చేతి పెట్టకుండా) చెప్పడం కనిపించింది. అదే సమయంలో, తరువాత అతనికి వెండి కిరీటాన్ని అందించారు. దానిని అతను ధరించారు. అందుకే బీజేపీ అఖిలేష్ యాదవ్‌ను టార్గెట్ చేసి, ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ఆయుధంగా మలుచుకుంది.
Read Also…. Ukraine Russia: ఉక్రెయిన్ సర్కార్ కీలక నిర్ణయం.. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటన