AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: పరువు కోసం కన్న బిడ్డ ఉసురు తీసిన తల్లి.. చేతులు కట్టేసి కిరాతకంగా..

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. పరువు ఖరీదు కన్న బిడ్డ ప్రాణం అయింది. కులం తక్కువ యువకుడిని కూతురు ప్రేమించిందని.. కన్నతల్లి ఆమె ప్రాణం తీసింది.. చంద్రగిరి పీఎస్ పరిధిలోని నరసింగాపురంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల విచారణలో తల్లి ఘాతుకం వెలుగు చూసింది. ఈ నెల 4న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నరసింగాపురంలో 17 ఏళ్ల మైనర్ బాలిక మృతిపై గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు వ్యవహారం బయటపడింది.

Andhra News: పరువు కోసం కన్న బిడ్డ ఉసురు తీసిన తల్లి.. చేతులు కట్టేసి కిరాతకంగా..
Crime News
Raju M P R
| Edited By: |

Updated on: Apr 12, 2025 | 9:21 AM

Share

తిరుపతి జిల్లాలో ఘోరం జరిగింది. పరువు ఖరీదు కన్న బిడ్డ ప్రాణం అయింది. కులం తక్కువ యువకుడిని కూతురు ప్రేమించిందని.. కన్నతల్లి ఆమె ప్రాణం తీసింది.. చంద్రగిరి పీఎస్ పరిధిలోని నరసింగాపురంలో ఈ దారుణం జరిగింది. పోలీసుల విచారణలో తల్లి ఘాతుకం వెలుగు చూసింది. ఈ నెల 4న జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నరసింగాపురంలో 17 ఏళ్ల మైనర్ బాలిక మృతిపై గ్రామస్తులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు వ్యవహారం బయటపడింది. మైనర్ బాలిక మృతికి గల కారణాలపై ఆరా తీసిన పోలీసులకు.. పరువు హత్య వ్యవహారం తేటతెల్లమైంది. మిట్టపాళెం ఎస్సీ కాలనీకి చెందిన ఓ యువకుడిని 17 ఏళ్ల మైనర్ బాలిక ప్రేమించింది. ఇది తల్లికి నచ్చలేదు.. ఈ కులాంతర ప్రేమ వ్యవహారం కాస్త తల్లిని హంతకురాలిగా చేసింది.

6 నెలల క్రితం  యువకుడిని ప్రేమించిన తన కూతురు గర్భం దాల్చినట్లు తల్లి గుర్తించింది. అబార్షన్ చేయించి ప్రేమించిన యువకుడికి దూరంగా ఉండాలని మందలించింది. ఆ తర్వాత మైనర్ బాలికైన తన కూతురుపై లైంగిక దాడి జరిగిందని అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్ కు పంపారు. చిత్తూరు జైల్లో ఉన్న అజయ్.. ఈ మధ్యనే బెయిల్ పై విడుదలయ్యాడు.. ఆ తర్వాత కూడా వారిద్దరి మధ్య లవ్ మేటర్ తిరిగి కంటిన్యూ అయ్యింది. ప్రేమించిన అజయ్ జైల్లో ఉన్న సమయంలోనూ రెండుసార్లు జైలుకు వెళ్లి కలిసి వచ్చిందని తెలుసుకున్న తల్లి.. కన్న కూతురు వ్యవహారంలో కఠినంగా వ్యవహరించాలనుకుంది.

జైలు నుంచి బయటకు వచ్చిన అజయ్‌తో మళ్లీ తిరుగుతుందని గుర్తించి.. మనస్పర్ధలతో భర్తకు దూరంగా ఉంటున్న ఆమె.. కూతురు నిర్వాకంపై అతనితో చర్చించింది.. కూతురు ప్రేమ వ్యవహారాన్ని భర్తకు చెప్పి కులం తక్కువ యువకుడితో ప్రేమ వద్దని ఒప్పించాలని అడిగింది. బంధువుల దగ్గర పంచాయితీ పెట్టి మందలించింది. అయితే అజయ్ ప్రేమనే కావాలని మొండికేసిన బాలికతో తల్లి గొడవ పడింది. కూతురు చేసిన సెల్ ఫోన్ చాటింగ్ పై నిలదీసిన తల్లిని.. బాలిక ప్రతిఘటించడంతో గొడవ పెద్దదయింది.

ఆ తర్వాత.. తల్లి దారుణం నిర్ణయం తీసుకుంది.. ఇంట్లో కూతురు రెండు చేతులు కట్టేసి.. నోరు ముక్కు అదిమి పెట్టి.. ఆమెను చంపేసింది.. కూతురు చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంటికి తాళం వేసి తిరుమలలో పారిశుద్ధ కార్మికురాలుగా చేస్తున్న పనికి వెళ్లిపోయింది. ఊపిరి తీసి విధులకు వెళ్లిపోయిన తల్లి మరుసటి రోజు ఉదయం భర్తకు ఫోన్ చేసి కూతుర్ని స్కూలుకు వెళ్లేందుకు నిద్ర లేపమని పంపింది. విషయం తెలియని తండ్రి ఇంటికి వెళ్లి చూసే సమయానికి మైనర్ బాలిక విగతజీవిగా పడిపోయి ఉంది. అప్పటికే ఆమె మరణించినట్లు గ్రామస్థులకు తెలిసింది.. అనంతరం.. హడావుడిగా తిరుమలనుంచి తిరిగి వచ్చిన తల్లి బంధువులతో కలిసి ఆటోలో మృతదేహాన్ని గ్రామం సమీపంలోని వంక వద్దకు తీసుకెళ్లి దహనం చేసింది..

అయితే.. ఈ ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత బాలిక మృతి పై గ్రామంలో చర్చ మొదలుకావడంతో ప్రారంభమైంది.. ప్రేమించిన యువతి మృతి విషయం ప్రేమికుడికి కూడా తెలిసింది. అది హత్య అని అతను ఆరోపించాడు.. అయితే.. మైనర్ బాలిక డెడ్ బాడీకి గంటల వ్యవధిలోనే దహనం చేసి అంత్యక్రియలు పూర్తి చేయడంతో స్థానికుల్లో అనుమానం పెరిగింది. బాలిక మృతిపై పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. బాలిక డెడ్ బాడీ దహనం చేసిన ప్రాంతంలో ఎముకలు, బూడిదను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపిన పోలీసులు.. పరువు కోసం ఈ  హత్య చేసినట్లు గుర్తించారు. తల్లి ప్రధాన నిందితురాలని తేల్చారు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..