Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP Inter Results 2025: ఇంటర్మీడియట్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న విద్యార్ధులకు శుభవార్త.. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాలు శనివారం ఉదయం విడుదలయ్యాయి. ఈ మేరకు ఇంటర్ బోర్డు అధికారులు ఫలితాలను అందుబాటులోకి తీసుకువచ్చారు. విద్యార్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్ ద్వారా నేరుగా రిజల్ట్స్‌ చెక్ చేసుకోవచ్చు..

AP Inter Results 2025: ఇంటర్మీడియట్ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ ఫలితాలు వచ్చేశాయ్‌.. రిజల్ట్స్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే
AP Inter Results 2025
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 13, 2025 | 1:47 PM

అమరావతి, ఏప్రిల్ 12: ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్‌ వార్షిక పరీక్షల ఫలితాలు ఇంటర్ బోర్డు అధికారులు ఈరోజు ఉదయం 11 గంటలకు విడుదల చేశారు. పరీక్షలు రాసిన విద్యార్ధులు ఈ కింది టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌ లింకు ద్వారా డైరెక్టుగా ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.5 లక్షల మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. తాజా ఫలితాల్లో ఎప్పటి మాదిరిగానే అమ్మాయిలు సత్తా చాటారు. ఈసారి కూడా టాప్‌ ర్యాంకులన్నీ అమ్మాయిలే కైవసం చేసుకున్నారు.

ఇవి కూడా చదవండి

ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఫలితాలు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌తోపాటు ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా చెక్‌ చేసుకోవచ్చు. అలాగే ఇటీవల కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మన మిత్ర వాట్స్ యాప్ నంబర్‌ 9552300009కు ‘hi’ అని మెసేజ్‌ పెట్టి కూడా చిటికెలో ఫలితాలు సులువుగా తెలుసుకోవచ్చు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షలు 26 జిల్లాల్లో మొత్తం 1535 కేంద్రాల్లో దాదాపు 10,58,892 మంది విద్యార్ధులకు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. పరీక్షలు పూర్తైన కేవలం 20 రోజుల్లోనే మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేసిన ఇంటర్ బోర్డు గతేడాది మాదిరి గానే ఈ సారి కూడా సరిగ్గా ఏప్రిల్ 12వ తేదీన ఫలితాలను వెల్లడించింది.

ఇక ఇంటర్‌ తాజా ఫలితాల్లో ఎవరైనా విద్యార్ధులకు ఎలాంటి సందేహాలున్న నివృతి చేసుకోవడానికి బోర్డు అధికారులు టోల్ ఫ్రీ నెంబర్‌తోపాటు ఈమెయిల్‌ ఐడీలను కూడా జారీ చేస్తారు. అలాగే రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌లకు కూడా అవకాశం ఇస్తారు. ఆ తేదీలను కూడా ఈ రోజే వెల్లడిస్తారు. ఇక కొన్ని సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించిన విద్యార్ధులతోపాటు ఫెయిలైన విద్యార్ధులకు కూడా సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరీక్షల షెడ్యూల్ కూడా అధికారులు ఈ రోజే వెల్లడిస్తారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..