Mangalagiri: లక్ష్మీనరసింహ స్వామి ‘పెద్ద కోనేరు’కు మహర్ధశ.. త్వరలోనే వాడుకలోకి.. తెప్పోత్సవాలు కూడా..

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మహర్దశ రాబోతోంది. మరుగున పడిన చరిత్ర మరోసారి వెలుగులో వస్తోంది. పెద్ద కోనేరును అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.పునరుద్దరణ పనులు కొనసాగుతుండటంతో.. శ్రీచక్రం ఆకారంలోనున్న పెద్దకోనేరు అబ్బురపరుస్తోంది.

Mangalagiri: లక్ష్మీనరసింహ స్వామి 'పెద్ద కోనేరు'కు మహర్ధశ.. త్వరలోనే వాడుకలోకి.. తెప్పోత్సవాలు కూడా..
Mangalagiri Cheekati Koneru
Follow us
Basha Shek

|

Updated on: Jun 12, 2023 | 8:22 AM

మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి మహర్దశ రాబోతోంది. మరుగున పడిన చరిత్ర మరోసారి వెలుగులో వస్తోంది. పెద్ద కోనేరును అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.పునరుద్దరణ పనులు కొనసాగుతుండటంతో.. శ్రీచక్రం ఆకారంలోనున్న పెద్దకోనేరు అబ్బురపరుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి అనగానే ఠక్కున లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గుర్తుకు వస్తుంది. ఇక్కడి స్వామివారి విగ్రహాన్ని పాండవులు ప్రతిష్టించారని ప్రతీతి. ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఆలయాన్ని నిర్మించగా.. సదాశివరాయల హయాంలో ఆయన మేనల్లుడు రాజయ్య దక్షిణాన పెద్ద కోనేరు నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. 464 ఏళ్ల క్రితం ఆ కోనేటిని నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. 1970 వరకూ ఈ కోనేటిలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించేవారు. స్వామివారిని దర్శించుకునే వారు పుష్కరిణిలో స్నానమాచరించేవారు. అయితే.. కొన్నేళ్ల తర్వాత కోనేరు శిథిలావస్థకు చేరి డంపింగ్ యార్డుగా మారిపోయింది. కోనేటి నిర్మాణాలు కూలిపోయాయి. నీరు కూడా పైవరకూ చేరుకుంది. వాస్తవానికి.. 30 ఏళ్ల క్రితం కోనేరు అభివృద్ధికి ప్రయత్నాలు చేసినప్పటికీ సాధ్యపడలేదు. ఈ క్రమంలో పెద్ద కోనేరును పునర్నిర్మాణం చేయాలని మంగళగరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంకల్పించారు. గత ఏడాది డిసెంబర్‌లో పనులు మొదలు పెట్టారు. మొత్తం నీటిని తోడటానికే నాలుగు నెలల సమయం పట్టింది. అయితే.. నీళ్లు తగ్గిపోతున్న కొద్దీ అనేక నిర్మాణాలు బయటపడుతున్నాయి.

మొదట కోనేరు పడమర గోడపై ఆంజినేయ స్వామి దేవాలయం బయటపడింది. ఆలయం ఎదుట ధ్వజ స్తంభం కూడా ఉంది. ఈశాన్య మూలలో రెండు శివలింగాలు బయటపడ్డాయి. తూర్పు మెట్లపై శివలింగాకార తోరణాల మెట్లు వెలుగు చూశాయి. వీటిని తిలకించేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇప్పటికే 120 అడుగుల వరకూ వెళ్ళారు. ఇంకా అడుగున బావి ఉన్నట్లు భావిస్తున్నారు. అయితే.. కోనేరు చతుర్భుజా, షడ్బుజా అర్థం కావటం లేదు. కానీ.. భక్తులు మాత్రం శ్రీ చక్రం ఆకారంలో కోనేరును నిర్మించారని చెబుతున్నారు భక్తులు. మొత్తంగా.. మరో రెండు నెలల్లో పునర్‌నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. కోనేరును వాడుకలోకి తీసుకురావడమే కాకుండా స్వామివారి తెప్పోత్సవం నిర్వహించేలా ఏర్పాట్లు సాగుతున్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
నెక్ట్స్ ఏంటి?డైరెక్టర్ శంకర్ తర్వాత ప్రాజెక్ట్‌పైనే అంతా ఫోకస్!
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
గుమ్మడి గింజలు మహిళలకు చేసే మేలు అంతా ఇంతా కాదు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
యూట్యూబ్‌ను వీడు ఎందుకు వాడుకున్నాడో తెలిస్తే బిత్తరపోతారు..
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఈజీగా హిందీ నేర్చుకోవాలనుకునేవారికి సూపర్ ఆప్షన్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
ఎవరూ ఊహించని ప్లేస్‌లో ప్రభాస్ ది రాజా సాబ్ సినిమా ఆడియో లాంచ్
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
హైబీపీ మందులు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంట.. జాగ్రత్త మరి..
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..
పిల్లల్లో గుండె పోటు లక్షణాలు.. వెంటనే అలెర్ట్ అవ్వండి..