మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‌పై విచారణ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. గత విచారణలో ఇవాళ్టి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగించింది హైకోర్టు. ఈవీఎం ధ్వంసంతో పాటు మరో మూడు కేసుల్లో మధ్యంతర బెయిల్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన గొడవల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. EVM ధ్వంసం కేసులో A1గా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. కాగా గతంలో టీడీపీ రిలీజ్ చేసిన వీడియోనే ఆధారంగా చూపుతున్నారని పిన్నెల్లి లాయర్ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు.
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది. గత విచారణలో ఇవాళ్టి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగించింది హైకోర్టు. ఈవీఎం ధ్వంసంతో పాటు మరో మూడు కేసుల్లో మధ్యంతర బెయిల్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన గొడవల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై 4 కేసులు నమోదయ్యాయి. EVM ధ్వంసం కేసులో A1గా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. కాగా గతంలో టీడీపీ రిలీజ్ చేసిన వీడియోనే ఆధారంగా చూపుతున్నారని పిన్నెల్లి లాయర్ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు. ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిన్నెలికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
గత నెల చివర్లో కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ను మరి కొన్ని రోజులు పొడిగిస్తూ ఆదేశించింది. గతంలో కూడా తాను ఎక్కడికీ పారిపోవడంలేదని, తన పాస్ పోర్టును కూడా పోలీస్ స్టేషన్ లో హ్యాండోవర్ చేశారు. అలాగే ‘టీడీపీ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని అరెస్ట్ చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ తతంగంపై పిన్నెల్లి తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఆయన ఇప్పటి వరకు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు. పల్నాడు జిల్లాలోని మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ నివాసంలో బస చేస్తున్నారు. ఆయన ఉంటున్న ఇంటి చుట్టూ పోలీసు సిబ్బందితో పహారా కాస్తున్నారు. అయితే ఈరోజు కోర్టుకు హాజరుపర్చాల్సి ఉండగా ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయోనన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…