తిరుమల శ్రీవారి సేవలో సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన పార్టీ శ్రేణులు

ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి సేవలో తరిస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి తిరుమలకు విచ్చేశారు చంద్రబాబు. ఉదయం 7.30 నుంచి 8 గంటలమధ్య శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈయనతో పాటు సతీమణి భువనేశ్వరీ, ఏపీ మంత్రి నారాలోకేష్ దంపతులు నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. నిన్న రాత్రి శ్రీవారి సన్నిధిలో బసచేసిన చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు ఈరోజు స్వామి వారిని దర్శించుకోనున్నారు. కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబుకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఘనస్వాగతం పలికారు.

Follow us

|

Updated on: Jun 13, 2024 | 6:49 AM

ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీవారి సేవలో తరిస్తున్నారు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత తొలిసారి తిరుమలకు విచ్చేశారు చంద్రబాబు. ఉదయం 7.30 నుంచి 8 గంటలమధ్య శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఈయనతో పాటు సతీమణి భువనేశ్వరీ, ఏపీ మంత్రి నారాలోకేష్ దంపతులు నిన్న సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. నిన్న రాత్రి శ్రీవారి సన్నిధిలో బసచేసిన చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులు ఈరోజు స్వామి వారిని దర్శించుకోనున్నారు. కుటుంబంతో కలిసి తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబుకు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు రాకతో తిరుపతి, తిరుమలలో సందడి వాతావరణం నెలకొంది. తిరుపతి వీధుల్లో ఎటు చూసినా పసుపు జెండాలే దర్శనం ఇచ్చాయి. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి తిరుపతికి రావడంతో కార్యకర్తలు, అభిమానులు, పార్టీ శ్రేణులు ఆయనకు నీరాజనం పట్టారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…