AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: శ్రీవారి సేవలో తరించిన సీఎం చంద్రబాబు కుటుంబం.. బాధ్యతలు అప్పటి నుంచే..

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు. తనతోపాటు సతీమణి భువనేశ్వరి, నారాలోకేష్ దంపతులు దేవాన్ష్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ముందుగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఆలయ ముఖద్వారం వద్ద వేదపండితులు సదరస్వాగతం పలికారు. ప్రధానఅర్చకులు సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులను ధ్వజస్తంభ మండపం నుంచి ప్రత్యేక మార్గంగుండా ఆలయంలోనికి పిలుచుకుని వెళ్లారు. తదనంతరం స్వామివారి అంతరాలయంలో కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు.

Tirumala: శ్రీవారి సేవలో తరించిన సీఎం చంద్రబాబు కుటుంబం.. బాధ్యతలు అప్పటి నుంచే..
Cm Chandrababu
Srikar T
|

Updated on: Jun 13, 2024 | 10:05 AM

Share

తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు. తనతోపాటు సతీమణి భువనేశ్వరి, నారాలోకేష్ దంపతులు దేవాన్ష్ శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ముందుగా చంద్రబాబు కుటుంబ సభ్యులకు ఆలయ ముఖద్వారం వద్ద వేదపండితులు సదరస్వాగతం పలికారు. ప్రధానఅర్చకులు సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులను ధ్వజస్తంభ మండపం నుంచి ప్రత్యేక మార్గంగుండా ఆలయంలోనికి పిలుచుకుని వెళ్లారు. తదనంతరం స్వామివారి అంతరాలయంలో కుటుంబ సభ్యులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. రంగనాయక మండపంలో మలయప్ప స్వామివారి శేషవస్త్రాన్ని కప్పి, స్వామివారి తీర్థప్రసాదాలతో వేదపండితుల ఆశీర్వచనం అందజేశారు. చివరగా స్వామివారి చిత్రపటాన్ని బహుకరించారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబసభ్యులు నేరుగా బసచేసిన గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఉదయం 10గంటలకు తిరుమల నుంచి బయలుదేరి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఉండవల్లిలోని స్వగృహానికి కుటుంబసభ్యులతో కలిసి చంద్రబాబు తిరుగుపయనం అవుతారు.

ఆ తరువాత రాష్ట్ర సచివాలయానికి చేరుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈరోజు కొన్ని బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 4.41కు సచివాలయంలో బాధ్యతలు స్వీకరించి కొన్ని ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన మ్యానిఫెస్టోలోని మొత్తం హామీలలో తొలుత ఐదింటిని అమలు చేసేందుకు ఆయా ఫైల్స్‎పై సంతకాలు చేయనున్నారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యంగా మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్నారు సీఎం చంద్రబాబు. ఆ తరువాత ఎన్నికల ప్రచారంలో సంచలనం సృష్టించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం ఏపీలో రద్దు చేస్తూ ఆ ఫైల్ పై రెండో సంతకం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక వితంతులు, వృద్దులకు అందించే నెలసరి పెన్షన్ రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు. ఈ హామీ గత ఏప్రిల్ నెల నుంచి అమలు అవనున్నట్లు తెలుస్తోంది. కాగా గత మూడు నెలలకు సంబంధించిన బకాయిలు రూ. 3వేలు, జూలై నెల పెన్షన్ రూ. 4వేలకు జత చేసి మొత్తం రూ. 7వేలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే పేదవాడికి కడుపునింపే బృహత్తర పథకం అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేయనున్నట్లు సమాచారం. చివరగా యువతకు ఉపాధి కల్పనకు ప్రోత్సహిస్తూ వారి భవిష్యత్తుకు దోహదపడేలా స్కిల్ సెన్సస్‌పై ఐదో సంతకం చేయనున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
కొత్త సంవత్సరం వేళ ఇంట్లోంచి సామాన్లు బయటపడేస్తారు! ఎక్కడో తెలుసా
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
పళ్లు తోమితే చాలు అనుకుంటున్నారా?అసలు ఎంత సేపు, ఎలా బ్రష్ చేయాలి
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
హైదరాబాద్ వాసులకు రద్దీ లేని ప్రయాణం.. 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
గర్ల్ ఫ్రెండ్ ఉండగానే రచ్చ..హార్దిక్ రియాక్షన్ చూసి అంతా షాక్
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
రిస్క్‌ లేకుండా మీ డబ్బును భారీగా పెంచే స్కీమ్‌ ఇవే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
1960లో 52 ఏళ్లు.. మరి ఇప్పుడు ఎంతో తెలుసా? ఆయుష్షు లెక్కలివే!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
శ్రీవారి భక్తులకు బిగ్‌ అలర్ట్.. 3రోజుల పాటు దర్శన టికెట్ల రద్దు!
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
కన్నడ పవర్ స్టార్‌తో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న నటుడు.. వైరల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
జీమెయిల్ వాడేవారికి ఇక పండగే.. స్టన్నింగ్ ఫీచర్ తెచ్చిన గూగుల్
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!
ఇంటి కోసం ఉద్యోగులకు EPFO సపోర్ట్‌..!