AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra News: మూడేళ్ల బాలుడి కిడ్నాప్.. గంటల వ్యవధిలో రక్షించిన పోలీసులు.. ఎత్తుకెళ్లిందెవరో తెలిస్తే..

Three-year-old child rescued: కిడ్నాప్ కు గురైన మూడేళ్ల బాబును కేవలం గంటల వ్యవధిలో గుర్తించి, క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చి శభాష్ అనిపించుకున్నారు. గుంటూరు జిల్లాకు చెందిన పోలీసులు. ఆదివారం మధ్యాహ్నం నుంచి బాలిక కనిపించట్లేదని తల్లిదండ్రలు ఇచ్చిన ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు వెంటనే బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం గంటల వ్యవధిలోనే బిడ్డ ఆచూకీ గుర్తించి.. బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

Andhra News: మూడేళ్ల బాలుడి కిడ్నాప్.. గంటల వ్యవధిలో రక్షించిన పోలీసులు.. ఎత్తుకెళ్లిందెవరో తెలిస్తే..
Andhra News
Anand T
|

Updated on: Oct 27, 2025 | 7:30 PM

Share

పాత గుంటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని RTC కాలనీకి చెందిన షేక్ షాఫిఉల్లా అనే వ్యక్తి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. బాలుడి తల్లి ఫిర్యాది వదిన (మేనత్త కూతురు) అయిన పటాన్ షకీలా తనకి వున్న కుటుంబ సమస్యల వలన గత వారం నుండి ఫిర్యాది వాళ్ళ నాన్న గారి ఇంట్లో ఉంటుంది.ఈ క్రమంలో తనకి ఉన్న అప్పుల నుండి బయటపడటానికి బాబుని కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేద్దామనే దురుద్దేశంతో ఎవరికీ చెప్పకుండా బాబుని తీసుకొని వెళ్ళిపోయి చెన్నైలో వున్న తన అన్న అయిన shaik sahidulla కి ఫోన్ చేసి.. తనకు రూ. 6 లక్షలు కావాలని.. అవి ఇస్తేనే బాబుని అప్పగిస్తానని బ్లాక్‌మెయిల్ చేసింది.

దీంతో బాధిత కుటుంబ సభ్యులు వెంటనే పాత గుంటూరు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాబుని కిడ్నాప్ చేసిన నిందితులను ఈ రోజు ఉదయం గుంటూరు బస్టాండ్ వద్ద అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుండి బాబుని సురక్షితంగా రక్షించి, అతని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలైన షకీలాని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సకాలంలో పోలీసులకు సమాచారం ఇవ్వడం వల్ల త్వరితగతిన చర్యలు తీసుకోగలిగామని, తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల జాగ్రత్త వహించాలని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా మీ పిల్లలను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.