Gas Adulteration: మీ ఇంట్లో వాడే సిలిండర్‌లో గ్యాసే వస్తోందా? ఈ నయా మోసం తెలిస్తే గుడ్లు తేలేస్తారు..

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా.. డబ్బుపై దురాశతో కేటుగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. తినే ఆహారం మొదలు..

Gas Adulteration: మీ ఇంట్లో వాడే సిలిండర్‌లో గ్యాసే వస్తోందా? ఈ నయా మోసం తెలిస్తే గుడ్లు తేలేస్తారు..
ఇంకా గ్యాస్‌ వాసన రావడం వెనుక కూడా ఓ రహస్యం దాగి ఉంది. సిలిండర్‌ను తయారు చేసే సమయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ సమయంలో ఎల్‌పీజీకి వాసన ఉండదు. దీనికి మండే స్వభావం ఉంటంది. వాసన లేకపోతే ఎల్‌పీజీ లీక్ అవుతుందా? లేదా? అని గుర్తించడం కష్టం అవుతుంది.
Follow us

|

Updated on: Jan 03, 2023 | 3:59 PM

కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా.. డబ్బుపై దురాశతో కేటుగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. తినే ఆహారం మొదలు.. తాగే నీరు, పాల వరకు అన్నింటి వరకు కల్తీ చేస్తున్నారు మాయగాళ్లు. ఈ క్రమంలోనే తాజాగా మరో ఘరానా మోసం వెలుగు చూసింది. ఇప్పటి వరకు ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ వచ్చిన కేటుగాళ్లు.. ఇప్పుడు వంటకు ఉపయోగించే గ్యాస్‌ను సైతం కల్తీ చేసేస్తున్నారు. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు కావన్నట్లుగా.. కంటికి కనిపించే ప్రతి సిలిండర్‌లో వ్చే గ్యాస్ కూడా స్వచ్ఛమైనది కాదని రుజువు చేశారు మాయగాళ్లు. ఇందుకు నిదర్శనమైన ఘరానా మోసం ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో బటయపడింది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం తొర్లపాడు గ్రామంలో గ్యాస్‌ సిలిండర్‌లోంచి నీళ్లు వచ్చాయి. అది గమనించిన కొనుగోలు దారులు ఆందోళనకు దిగారు. తొర్లపాడు గ్రామానికి చెందిన నాగమల్లేశ్వరరావు, ఇతర గ్రామస్తులు ఇండేన్ గ్యాస్ కొనుగోలు చేశారు. పెనుగంచిప్రోలు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద డొమెస్టిక్ సిలిండర్ తీసుకున్నారు. అయితే, గ్యాస్ సిలిండర్‌ను, స్టౌ్వ్‌కు ఫిక్స్ చేశాక మంట రాలేదు. దాంతో సిలిండర్‌ను చెక్ చేశారు. అందులో సగానికి పైగా నీళ్లు ఉన్నట్లు గుర్తించారు. ఖాళీ సిలిండర్ 14 కిలోలకు బదులుగా 17 కిలో ఉందని, మిగతాది అంతా వాటర్ అని గుర్తించిన వినియోగదారులు ఆందోళనకు దిగారు.

గ్యాస్ సిలిండర్లలో నీళ్లు ఉండటంతో వాటిని తీసుకుని రోడ్డుపై బైఠాయించారు గ్యాస్ వినియోగదారులు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తున్న వాహనాన్ని నిలిపివేసి ధర్నాకు దిగారు. గ్యాస్‌కు బదులుగా వాటర్‌ను నింపి వినియోగదారులను మోసం చేస్తున్నారని, పెనుగంచిప్రోలు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..