Andhra Pradesh: అమ్మ బాబోయ్.. స్కూళ్లో పిల్లలు ఆడుకుంటుండగా వినిపించిన వింత శబ్ధాలు.. ఏంటని చూడగా గుండె దఢేల్..

Andhra Pradesh: సాధారణంగా పరిసరాలన్నీ ముళ్ల పొదలు, చెట్లు ఉంటే.. విష సర్పాలు, ప్రమాదకర జీవులు ప్రవేశించడం సహజం. అయితే, ప్రస్తుత కాలంలో అడవులు తరిగిపోవడంతో..

Andhra Pradesh: అమ్మ బాబోయ్.. స్కూళ్లో పిల్లలు ఆడుకుంటుండగా వినిపించిన వింత శబ్ధాలు.. ఏంటని చూడగా గుండె దఢేల్..
Representative Photo
Follow us
Shiva Prajapati

|

Updated on: Jan 03, 2023 | 5:43 PM

సాధారణంగా పరిసరాలన్నీ ముళ్ల పొదలు, చెట్లు ఉంటే.. విష సర్పాలు, ప్రమాదకర జీవులు ప్రవేశించడం సహజం. అయితే, ప్రస్తుత కాలంలో అడవులు తరిగిపోవడంతో.. విష సర్పాలు ఇళ్లలోకి వస్తున్నాయి. తాజాగా.. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రభుత్వ బాలికల పాఠశాలలో తాచుపాము హల్‌చల్ చేసింది. స్కూల్ ఆవరణలో పిల్లలు ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా తాచుపాము దూసుకొచ్చింది. అది గమనించిన విద్యార్థినిలు హడలిపోయారు. భయంతో తలోదిక్కు పరుగులు తీశారు. పాఠశాలలోకి తాచుపాము వచ్చినట్లు ఉపాధ్యాయులకు తెలిపారు విద్యార్థినిలు. వెంటనే అలర్ట్ అయిన ఉపాధ్యాయులు.. స్నేక్ క్యాచర్‌ గణేష్ వర్మకు సమాచారం అందించారు. విషయం తెలుసుకుని వెంటనే స్కూల్‌కి వచ్చాడు వర్మ. పాఠశాల ఆవరణలో హల్‌చల్ చేస్తోన్న తాచుపామును ఎంతో చాకచక్యంగా పట్టుకున్నా డు. అనంతరం దానిని ఓ ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి.. సురక్షిత ప్రాంతంలో వదిలిపెట్టాడు. దాంతో ఉపాధ్యాయులు, విద్యార్థినిలు ఊపిరి పీల్చుకున్నారు.

ఇదిలాఉంటే.. స్కూల్‌లోకి తాచుపాము చొరబడటం, దాన్ని చూసి టీచర్స్‌, స్టూడెంట్స్‌ భయపడటం, లోకల్‌గా ఉండే స్నేక్ క్యాచర్ గణేష్ వర్మను పిలవడం అంతా బాగేనే ఉంది. అతను దాన్ని పట్టుకోవడంలోనూ పెద్ద విషయం లేదు గానీ.. ఆ పామును పట్టుకునే విధానం మాత్రం హైలెట్‌గా నిలిచిందిక్కడ. పామును పట్టుకుని దాన్ని ఓ బాక్స్‌లో బంధించే విధానం విద్యార్థులకు ఓ పాఠంలా కనిపించింది. పామును ఎలా పట్టుకుంటున్నారో చాలా ఉత్సుకతతో చూసిన స్టూడెంట్స్ ఆ తర్వాత దాన్ని దగ్గరగా చూసి.. గణేష్‌ వర్మ నుంచి పాము గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ కాసేపు ఇదంతా.. రొటీన్‌కి భిన్నంగా జరిగిన ఓ ప్రాక్టికల్స్‌లా అనిపించింది.

ఇవి కూడా చదవండి

పామును పట్టుకుంటున్న గణేష్ వర్మ..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..