Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JNVS 6th Class Admissions: తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ విద్యార్ధులకు అలర్ట్! నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు 2023-24 నోటిఫికేషన్‌ విడుదల..

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది..

JNVS 6th Class Admissions: తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ విద్యార్ధులకు అలర్ట్! నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశాలకు 2023-24 నోటిఫికేషన్‌ విడుదల..
JNVS 6th Class Admissions
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 03, 2023 | 6:31 PM

జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందుకు నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా దాదాపు 649 నవోదయ విద్యాలయాల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో 29 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు జేఎన్‌వీల్లో ఉచిత విద్య, వసతి సౌకర్యాలు అందిస్తారు. బాలురు, బాలికలకు వేర్వేరు స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తారు.

ఈ స్కూళ్లలో ప్రవేశాలు పొందాలంటే.. సంబంధిత జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న జిల్లాల్లో ప్రవేశం కోరే విద్యార్థిని తప్పనిసరిగా నివాసి అయి ఉండాలి. అలాగే 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు తప్పనిసరిగా మే 1, 2011 నుంచి ఏప్రిల్‌ 30, 2013 మధ్య సంవత్సరాల్లో జన్మించి ఉండాలి. మొత్తం సీట్లలో గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయిస్తారు. విద్యార్ధులు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25 శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో జనవరి 31, 2023వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ఏప్రిల్‌ 29, 2023వ తేదీ ఉదయం 11 గంటల 30 నిముషాలకు నిర్వహిస్తారు. పరీక్ష ఫలితాలు జూన్‌ 2023లో విడుదలవుతాయి.

ప్రవేశ పరీక్ష విధానం

జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌-2023 (ప్రవేశ పరీక్ష)లో మూడు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మెంటల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్‌, లాంగ్వేజ్‌ ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులు వస్తాయి. 2 గంటల సమయంలో పరీక్ష రాయవల్సి ఉంటుంది. ఏపీ, తెలంగాణల్లో తెలుగు/ఇంగ్లిష్/హిందీ/మరాఠీ/ఉర్దూ/ఒరియా/కన్నడ మాధ్యమాల్లో ప్రవేశ పరీక్ష రాయవచ్చు.

ఇవి కూడా చదవండి

నోటిఫికేషన్‌ కోసం క్లిక్‌ చేయండి.

పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.