Telangana: జనవరి రెండో వారంలో 11 వేలకుపైగా తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు నియామక ప్రకటన.. ఖాళీల వివరాలు ఇవే..

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో దాదాపు 11,000లకుపైగా అధ్యాపకుల పోస్టులకు నియామక ప్రకటన జారీ చేయాలని గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయం..

Telangana: జనవరి రెండో వారంలో 11 వేలకుపైగా తెలంగాణ గురుకుల ఉద్యోగాలకు నియామక ప్రకటన.. ఖాళీల వివరాలు ఇవే..
TSPSC Gurukul Notification 2023
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 03, 2023 | 6:51 PM

తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల్లో దాదాపు 11,000లకుపైగా అధ్యాపకుల పోస్టులకు నియామక ప్రకటన జారీ చేయాలని గురుకుల రిక్రూట్‌మెంట్‌ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి కొత్తగా మంజూరైన 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల్లో మంత్రిమండలి ఆమోదించిన దాదాపు 2,591 ఖాళీ పోస్టులకు ఆర్థికశాఖ అనుమతులు వచ్చిన వారం నుంచి పది రోజుల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ముందస్తు కసరత్తు పూర్తి చేసింది. దీనికి సంబంధించి ఆర్థికశాఖ నుంచి అనుమతులు రాగానే నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. రోస్టర్‌, జోన్లు, మల్టీజోన్ల వారీగా పోస్టులను గుర్తింపు పూర్తిచేసింది. జనవరి రెండో వారంలో ప్రకటన జారీ చేయాలని గురుకుల బోర్డు భావిస్తోంది.

రెసిడెన్షియల్‌ గురుకులాల్లో ఇప్పటికే 9,096 పోస్టులను రాష్ట్ర సర్కార్‌ మంజూరు చేసింది. అదనంగా మంజూరైన పోస్టులతో కలిపి ఒకేసారి భారీగా నోటిఫికేషన్లు రానున్నాయి. ప్రకటన అనంతరం పరీక్షలకు సన్నద్ధమవడానికి కనీసం మూడు నెలల సమయం ఉండేలా షెడ్యూల్ తయారు చేయనున్నారు. గురుకులాల్లో ఒక్కో అభ్యర్థి అర్హతల మేరకు రెండు, ఆపైన పోస్టులకు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పోస్టులకు సన్నద్ధమై, పరీక్షలు రాసేలా షెడ్యూలు రూపొందించనుంది.

కొత్తగా ఏర్పాటైన బీసీ గురుకులాల్లో 2,591 పోస్టులతో కలిపి ఈ ఒక్క శాఖలోనే అత్యధికంగా 6,461 పోస్టులు ఉన్నాయి. ఎస్సీ సంక్షేమ శాఖలో 2,267, గిరిజన సంక్షేమశాఖలో 1,514, మైనార్టీ సంక్షేమశాఖలో 1,445 పోస్టులు భర్తీ కానున్నాయి. మహిళాశిశు సంక్షేమశాఖలో 23 మహిళ, శిశు సంక్షేమాధికారుల పోస్టులకు ఈ రోజు (జ‌న‌వ‌రి 3) రాతపరీక్ష నిర్వహించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని కెరీర్‌ సంబంధిత వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
మూడు గంటలపాటు పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన మందుబాబు
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
రోడ్డుపై చల్లా చదురుగా పడిపోయిన ఇంటింటి సర్వే దరఖాస్తులు.. వీడియో
ఎమ్మార్వో కార్యాలయం ముందు "చాకిరేవు".! బట్టలు ఉతికి, ఆరేసి నిరసన.
ఎమ్మార్వో కార్యాలయం ముందు
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
ఏపీకి వర్ష సూచన! మోస్తరు వర్షాలు 26నాటికి వాయుగుండంగా మారే అవకాశం
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
డ్రైవింగ్ రాని డ్రైవర్‌కి స్కూల్ బస్ అప్పగిస్తే.. యాక్సిడెంట్
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
భారత్ Vs పాకిస్తాన్.! పాక్‌ ఓడలో భారత మత్స్యకారులు.. రెండు గంటల
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
సంపూర్ణ ఆరోగ్యానికి రోజూ చిటికెడు.! ఆరోగ్య సమస్యలన్నీ పరార్..
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌.! కొత్తవారికి పెన్షన్లు జారీ.. స్వీకరణ?
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
హృదయవిదారక ఘటన.. తల్లి చెంతకు చేరేలోపే చిన్నారి.! వీడియో..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..
జియోనుంచి అదిరిపోయే కొత్త రీచార్జ్‌ ప్లాన్‌.! 4జీ కే 5జీ సేవలు..