AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ganesh Chaturthi 2023: మూడు వారాల ముందే మొదలైన వినాయక చవితి సందడి.. కొలువుదీరుతున్న విగ్రహాలు

సాధారణంగా వినాయకచవితి వారం రోజుల మందు నుండి పెద్ద పెద్ద విగ్రహాలను విక్రయిస్తుంటారు. అయితే ఈ ఏడాది అనుకూల వాతావరణం ఉండటంతో ఇప్పటి నుండి విగ్రహాలను విక్రయిస్తున్నారు. గుంటూరులోని పలు ప్రాంతాల విగ్రహాల విక్రయం మొదలైంది. రంగు రంగుల గణేష్ విగ్రహాలు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాది కూడా పండుగను పెద్ద ఎత్తున నిర్వహించలేకపోయారు. అయితే ఈ ఏడాది మాత్రం ఎటువంటి ఆటంకాలుండవని భక్తులు భావిస్తున్నారు.

Ganesh Chaturthi 2023: మూడు వారాల ముందే మొదలైన వినాయక చవితి సందడి.. కొలువుదీరుతున్న విగ్రహాలు
Lord Ganesh
T Nagaraju
| Edited By: |

Updated on: Aug 31, 2023 | 1:46 PM

Share

గత మూడేళ్లుగా వినాయక చవితి పండుగా జరుపుకోవటానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. కరోనాతో మొదలైన కష్టాలు ఈ ఏడాది పూర్తిగా తొలిగిపోయినట్లున్నాయి. దీంతో మూడు వారాల ముందే వినాయక చవితి సందడి మొదలైంది. ఈ ఏడాది వర్షాలు కూడా తక్కువుగా ఉన్నాయి. ధీంతో ఇప్పటి నుండే గణేష్ విగ్రహాలను విక్రయించడం ప్రారంభించారు.

సాధారణంగా వినాయకచవితి వారం రోజుల మందు నుండి పెద్ద పెద్ద విగ్రహాలను విక్రయిస్తుంటారు. అయితే ఈ ఏడాది అనుకూల వాతావరణం ఉండటంతో ఇప్పటి నుండి విగ్రహాలను విక్రయిస్తున్నారు. గుంటూరులోని పలు ప్రాంతాల విగ్రహాల విక్రయం మొదలైంది. రంగు రంగుల గణేష్ విగ్రహాలు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి. గత ఏడాది కూడా పండుగను పెద్ద ఎత్తున నిర్వహించలేకపోయారు. అయితే ఈ ఏడాది మాత్రం ఎటువంటి ఆటంకాలుండవని భక్తులు భావిస్తున్నారు. మరోవైపు వర్షాలు కూడా తక్కువగానే ఉన్నాయి. దీంతో ఇప్పటి నుండే పండుగ సందడి మొలైంది.

వచ్చే నెల 19 తేదిన వినాయక చవితి పండుగ. పండుగకు చాలా ముందు నుండే భక్తలు సమాజాలు విగ్రహాల కొనుగోలుపై ద్రుష్టి పెట్టాయి. అయితే గత ఏడాదితో పోల్చితే విగ్రహాల ధరల భారీగా పెరిగాయి. మూడు అడుగుల విగ్రహాన్ని ఏడు వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. ఇక పది అడుగుల ఎత్తున్న విగ్రహాం ధర పాతిక ముప్పై వేల రూపాయల ధర పలుకుతుంది. సుదీర్ఘకాలం నుండి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న భక్త సమాజాలు లక్షల రూపాయలు వెచ్చించి స్వంత డిజైన్లతో విగ్రహాలను తయారు చేయించుకుంటున్నారు.

కరోనా భయం పూర్తిగా పోవడంతో పాటు ఎటువంటి ఆంక్షలు కూడా లేకపోవడంతో భక్తులు అత్యంత్య వైభవంగా ఈ ఏడాది పండుగ జరుపుకునే అవకాశం కనిపిస్తుంది. దీంతో విగ్రహాలు తయారీదార్లు కూడా మూడు నెలల ముందు నుండే విగ్రహాల తయారీ మొదలు పెట్టారు. ఆర్డర్స్ కూడా భారీగా వచ్చినట్లు తయారీదారులు చెబుతున్నారు. దీంతో పాటే పండుగ సమయంలో విగ్రహాల సేల్స్ కూడా భారీగానే ఉంటుందని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలోనే ఈ ఏడాది మూడు వారాల ముందు నుండే విగ్రహాలను ప్రదర్శనకు ఉంచినట్లు తయారీ దారులు చెబుతున్నారు. పండుగకు చాలా రోజుల ముందు నుండే గణనాధులు కనువిందు చేస్తుండటంతో భక్తులు ఇప్పటి నుండి విగ్రహాల ధరలు ఎలా ఉన్నాయా అని ఎంక్వైరీ చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..