Visakhapatnam: విశాఖలో హాట్ డిస్కర్షన్‌గా మారిన హోర్డింగ్స్.. ఆమెకు చెక్ పెట్టేందుకే వాటిని పెట్టారా? ఇంట్రస్టింగ్ డీటెయిల్స్ మీకోసం..
‘‘చంద్రుడిని జయించాం. ఇక మిగిలింది సూర్యుడే’’ అన్న నినాదంతో విశాఖలో బీజేపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి పేరుతో ఉన్న ఆ హోర్డింగ్స్ ఇప్పుడు విశాఖ టాక్ అఫ్ ది సిటీ గా మారాయి. ఆ రాజ్యసభ సభ్యుడికి విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేయాలన్నది నెక్స్ట్ టార్గెట్. ఆ మేరకు ఏడాది ముందు నుంచే పని ప్రారంభించేశారు. విశాఖ ఆయన సొంత ప్రాంతం కానప్పటికీ.. అవకాశం ఉన్నప్పుడల్లా విశాఖ వచ్చి సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఆ ఎంపీ. అలాంటి ఎంపీ కి ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన నేత నుంచి కొత్త ప్రమాదం వచ్చి పడింది. గతంలో విశాఖ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆ నేత మళ్లీ విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నారట. అది తెలిసి ఇంకాస్త వేగం పెంచారు సదరు ఎంపీ.
‘‘చంద్రుడిని జయించాం. ఇక మిగిలింది సూర్యుడే’’ అన్న నినాదంతో విశాఖలో బీజేపీకి చెందిన ఓ రాజ్యసభ సభ్యుడి పేరుతో ఉన్న ఆ హోర్డింగ్స్ ఇప్పుడు విశాఖ టాక్ అఫ్ ది సిటీ గా మారాయి. ఆ రాజ్యసభ సభ్యుడికి విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేయాలన్నది నెక్స్ట్ టార్గెట్. ఆ మేరకు ఏడాది ముందు నుంచే పని ప్రారంభించేశారు. విశాఖ ఆయన సొంత ప్రాంతం కానప్పటికీ.. అవకాశం ఉన్నప్పుడల్లా విశాఖ వచ్చి సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఆ ఎంపీ. అలాంటి ఎంపీ కి ఇప్పుడు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన నేత నుంచి కొత్త ప్రమాదం వచ్చి పడింది. గతంలో విశాఖ ఎంపీగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆ నేత మళ్లీ విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేయాలన్న ఆలోచన ఉన్నారట. అది తెలిసి ఇంకాస్త వేగం పెంచారు సదరు ఎంపీ. మోడీ ఇండియాకు ఎలాగో, విశాఖకు ఆ ఎంపీ కూడా అలాగే అంటూ ఏర్పాటైన ఆ హార్దింగ్స్ ఉద్దేశంపై జరుగుతున్న చర్చ ఏంటో చూద్దాం.
చంద్రయాన్ 3 విజయంపై విశాఖపట్నంలో టీమ్ జీవీఎల్ పేరుతో భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి హోర్డింగులు విశాఖ నగరంలో అనేక ప్రాంతాల్లో ఉన్నాయి. చంద్రయాన్-3 విజయాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్న నేపథ్యంలో సెప్టెంబర్ రెండో తేదీన సూర్యునిపై అధ్యయనానికి భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ప్రారంభించబోయే ఆదిత్య L1 ప్రాజెక్ట్ విజయాన్ని కూడా కాంక్షిస్తూ TEAM GVL ఇదే హోర్డింగ్‌లో పేర్కొంటూ జగదాంబ సెంటర్, రైల్వే స్టేషన్, మురళినగర్ తో పాటు అనేక ప్రధాన కూడళ్లలో ప్రత్యేక హోర్డింగులు ఏర్పాటు చేసింది. ప్రధాని మోడీ సారథ్యంలో చంద్రయాన్ ఘన విజయం ఆదిత్యా-L1 ప్రయోగ విజయానికి కూడా మార్గం సుగమం కావాలని కాంక్షిస్తూ ‘మోడీ 4 వరల్డ్’, ‘జీవీఎల్ 4 వైజాగ్’ ఆంటూ చేస్తున్న ఈ వినూత్న ప్రచారం వెనుక పెద్ద కథే ఉందట.
జీవిఎల్ ఏడాదికి పైగా విశాఖ వేదికగా రాజకీయం చేస్తున్నారు. వాస్తవానికి బీజేపీకి చెందిన ప్రతీ రాజ్యసభ సభ్యుడూ బీజేపీ సిట్టింగ్ ఎంపీలు లేని ఏ లోక్‌సభ ను అయినా కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలు సాగించాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించిందట. దాంతో అప్పుడు జీవిఎల్ విశాఖను ఎంచుకున్నారట. విశాఖలో కూడా సాదా సీదాగా కాకుండా బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఉండే నియోజకవర్గాల కన్నా ఎక్కువ కార్యక్రమాలు చేస్తూ, సామాజిక వర్గాల వారీగా నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ వాళ్ళ సమస్యలను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తూ ఒకరకంగా చెప్పాలంటే విశాఖ రాజకీయాల్లో ఒక ముఖ్య భాగం అయిపోయారట జీవీఎల్.
విశాఖ లోక్‌సభ తెరపైకి పురంధరేశ్వరి పేరు..
అదే సమయంలో ఇటీవల బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన దగ్గుపాటి పురందేశ్వరికి కూడా విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారట. 2009లో పురుంధరేశ్వరి విశాఖ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేసి విజయం సాధించారు. కేంద్ర మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2014లో ఆమె రాజంపేట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తిరిగి 2019లో విశాఖ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగారు. అయితే అప్పుడు ఆమెకు వచ్చింది కేవలం 33 వేల ఓట్లు మాత్రమే. 2019 తర్వాత ఆమె భారతీయ జనతా పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పలు రాష్ట్రాల బాధ్యతలు, మహిళా మోర్చా ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండడంతో విశాఖపై ఆమె దృష్టి సారించిన సందర్భాలు చాలా తక్కువే. దాంతో జీవిఎల్‌కు మంచి అవకాశం లభించినట్టు అయిందట. అయితే పార్టీ అధ్యక్షురాలు ఆయిన తర్వాత పురంధరేశ్వరి విశాఖ లోక్‌సభ నుంచి మళ్లీ పోటీ చేసే అవకాశం ఉన్నట్టు వార్తలు వినిపించాయి. రాష్ట్ర అధ్యక్షురాలి హోదాలో అందులోనూ గతంలో విశాఖ నుంచే లోక్‌సభకు ఎంపికై, మాజీ కేంద్రమంత్రిగా చేసిన ఆమె.. తిరిగి ఆక్కడ నుంచే పోటీ చేస్తానంటే.. అధిష్టానం కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే జీవీఎల్ అలెర్ట్ అయ్యారట.
ఆమె 2009లో ఎంపీగా గెలిచినా, 2014లో రాజంపేట నుంచి పోటీ చేయడం, 2019లో విశాఖ నుంచి పోటీ చేసినా కేవలం 33 వేల ఓట్లు మాత్రమే రావడంతో పార్టీ పెద్దగా ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోదని జీవీఎల్ భావిస్తున్నారట. అందుకే తన పనిలో వేగం పెంచారట జీవీఎల్. ఈ క్రమంలోనే జీవీఎల్ ఫర్ వైజాగ్ అనే క్యాంపైన్‌ని భారీ ఎత్తున ప్రారంభించాలని నిర్ణయించారట. దానికి ముహూర్తం సెప్టెంబర్ రెండో తేదీన పెట్టడం వెనక కూడా కారణమేంటంటే సూర్య యానానికి సంబంధించి ఆదిత్య ఎల్ 1 సన్ మిషన్‌ని మోడీ అదే రోజు ప్రారంభించబోతున్న నేపథ్యంలో అదే రోజు జీవీఎల్ ఫర్ వైజాగ్ క్యాంపెయిన్‌ని స్టార్ట్ చేయడం ద్వారా తానే 2024 విశాఖ లోక్‌సభ బరిలో ఉండబోతున్నట్లు స్పష్టంగా చెప్పదలుచుకున్నారట. మరోవైపు జీవీఎల్ కదలికలను పురందరేశ్వరి వర్గం కూడా నిశితంగా పరిశీలిస్తుందట. ఆరోజు ఆ కార్యక్రమం జరగడానికి రాష్ట్ర పార్టీ అనుమతి కూడా ఏమీ అవసరం లేదని, ఇప్పటికే తాను విశాఖ నుంచి పోటీ చేసేందుకు అధిష్టానం అనుమతి తీసుకుని వాళ్ళ సూచన మేరకే పని చేస్తున్నట్టుగా జివిఎల్ చెబుతున్నారట. దీంతో అందరి దృష్టి సెప్టెంబర్ 2 పైన పడింది. దాన్ని బహిర్గతం చేసేందుకే జీవీఎల్ ఈ విధంగా నగరంలో పెద్ద సంఖ్యలో హోర్డింగ్స్ పెట్టారట. ఇప్పుడు ఆ హోర్దింగ్‌లే పెద్ద చర్చకు తెర లేపడం విశేషం.
గతంలో ట్విట్టర్ వేదికగా ‘జీవీఎల్ vs పురంధరేశ్వరి’ వార్..
గతంలో జీవీఎల్ కి పురందేశ్వరి కి మధ్య బేధాభిప్రాయాలు పలు సందర్భాల్లో వ్యక్తం అయ్యాయి. వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా జివిఎల్ ఒక ట్వీట్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా వైయస్ రాజశేఖర్ రెడ్డి, ఎన్టీఆర్ విగ్రహాలే కనిపిస్తాయని వాళ్ళిద్దరూ గొప్ప నాయకులే కానీ వంగవీటి మోహన్ రంగా విగ్రహాలు కూడా ప్రాధాన్యత సంతరించుకోవాలని ట్వీట్ చేశారు. దానిపై పురందేశ్వరి అనూహ్యంగా, చాలా సీరియస్ గా స్పందించారు ఎన్టీ రామారావు, వైయస్ రాజశేఖర్ రెడ్డి లు ఇద్దరూ సంక్షేమ ప్రధాతలు అనీ, లెజెండరీ నాయకులని, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదన్నట్టు ట్విట్టర్ వేదికగానే స్పందించారు. ఇలాంటి ట్వీట్లను సహించేది లేదంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తర్వాత జివీఎల్ దానిపై స్పందించలేదు. కానీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు అప్పట్లో బహిర్గతమైంది. ఆ తర్వాత ఆమె రాష్ట్ర పార్టీకి అధ్యక్షురాలుగా నియమితులు కావడం, గతంలో విశాఖ ఎంపీ గా పనిచేసిన నేపథ్యం ఉండడంతో విశాఖ లోక్‌సభ వేదికగా ఇద్దరి మధ్య మరోసారి ఆధిపత్య యుద్ధం ఎలా ఉండబోతుందన్న చర్చ ప్రస్తుతం ఈ హోర్డింగ్స్ చుట్టూ జరుగుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..