జల్లికట్టులో అపశృతి.. జనాలమీదికి దూసుకొచ్చిన ఎద్దులు!

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం అయ్యంరెడ్డి పల్లిలో జల్లికట్టు ఆడుతుండగా అపశృతి చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం గుమికూడటంతో బెదిరిపోయిన ఎడ్లు జనాలమీదకు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. జల్లికట్టు.. ఓ ఆటవిక సంప్రదాయం. మూగ జీవాలతో ఆడే ఈవికృత క్రీడకు ఎంతో మంది బలవ్వగా.. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. సంక్రాంతి పండుగ సమయంలో సంప్రదాయం.. పేరుతో […]

జల్లికట్టులో అపశృతి.. జనాలమీదికి దూసుకొచ్చిన ఎద్దులు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Dec 30, 2019 | 2:11 PM

చిత్తూరు జిల్లా పలమనేరు మండలం అయ్యంరెడ్డి పల్లిలో జల్లికట్టు ఆడుతుండగా అపశృతి చోటుచేసుకుంది. పెద్ద సంఖ్యలో జనం గుమికూడటంతో బెదిరిపోయిన ఎడ్లు జనాలమీదకు దూసుకొచ్చాయి. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. జల్లికట్టు.. ఓ ఆటవిక సంప్రదాయం. మూగ జీవాలతో ఆడే ఈవికృత క్రీడకు ఎంతో మంది బలవ్వగా.. మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు. సంక్రాంతి పండుగ సమయంలో సంప్రదాయం.. పేరుతో జల్లికట్టును నిర్వహిస్తూంటారు. తమిళనాడు సంప్రదాయ పండుగైన జల్లికట్టు.. ఏపీ సరిహద్దు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతోంది.