పోలీస్ యాక్షన్‌పై బాబు ఆగ్రహం.. నెక్స్ట్ స్టెప్ ఇదే!

అమరావతి ప్రాంత రైతుల అరెస్టులు ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్న విపక్షాలు బాధితులను పరామర్శించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ వర్గాలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అరెస్టయి రిమాండ్‌లో వున్న బాధితులను బాబు పరామర్శించారు. రైతుల అరెస్టును ఖండించిన చంద్రబాబు… పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై హత్యాయత్నం అభియోగాలు మోపడాన్ని బాబు ఖండించారు. రైతుబిడ్డలైన […]

పోలీస్ యాక్షన్‌పై బాబు ఆగ్రహం.. నెక్స్ట్ స్టెప్ ఇదే!

అమరావతి ప్రాంత రైతుల అరెస్టులు ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పు పడుతున్న విపక్షాలు బాధితులను పరామర్శించేందుకు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబునాయుడు పార్టీ వర్గాలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అరెస్టయి రిమాండ్‌లో వున్న బాధితులను బాబు పరామర్శించారు.

రైతుల అరెస్టును ఖండించిన చంద్రబాబు… పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులపై హత్యాయత్నం అభియోగాలు మోపడాన్ని బాబు ఖండించారు. రైతుబిడ్డలైన పోలీసులు రైతుల పట్ల సానుభూతిగా ఉండాలని, భూములు కోల్పోయి, రాజధానిపై ఆందోళనలో ఉన్నవాళ్లపై పోలీసు కేసులెందుకని, నిద్రాహారాలు మాని ఆందోళన చేసే రైతులపై పోలీసు దాడులు చేయడం హేయమైన చర్య అని చంద్రబాబు మండిపడ్డారు.

జరిగిన సంఘటనకు పోలీసులు పెట్టిన సెక్షన్లకు పొంతన ఉందా అని బాబు ప్రశ్నించారు. రాజధానికి భూములిచ్చిన రైతులను జైలు పాలు చేస్తారా అని అడిగారాయన. మహిళలు, వృద్దులను భయభ్రాంతులను చేస్తారా..? అని ప్రశ్నించారు. ఆరుగురు రైతులపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారని, అర్ధరాత్రి హడావుడిగా జైలుకు తరలించారని బాబు అన్నారు.

రాష్ట్రం కోసం భూములు త్యాగాలు చేసిన రైతులపై అమానుషంగా వ్యవహరిస్తున్నారని, 13 రోజులుగా వేలాది రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకటపాలెం, నెక్కల్లు, మోదుగ లంకపాలెం, వెలగపూడికి చెందిన 6 గురు రైతుల అరెస్ట్ అప్రజాస్వామికమని, వేలాది పోలీసులను దించి రైతుల ఆందోళనలను అణిచి వేయలేరని ఆయన అభిప్రాయపడ్డారు.

Click on your DTH Provider to Add TV9 Telugu