AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

Phani CH
|

Updated on: Feb 08, 2026 | 5:45 PM

Share

తెలంగాణలో 2026-27 లా కోర్సుల ప్రవేశాలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం టీజీ లాసెట్, పీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 3 ఏళ్ల, 5 ఏళ్ల LLB, LLM కోర్సులకు దరఖాస్తులు ఫిబ్రవరి 10 నుండి ప్రారంభమై, ఏప్రిల్ 1న ముగుస్తాయి. పరీక్ష మే 18న జరిగి, జూన్ 5న తుది ఫలితాలు ప్రకటించబడతాయి. పూర్తి వివరాలకు అధికారిక వెబ్‌సైట్ చూడండి.

తెలంగాణలో న్యాయశాస్త్ర కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు శుభవార్త. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి టీజీ లాసెట్ మరియు పీజీ లాసెట్ నోటిఫికేషన్‌ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లా కాలేజీల్లో 3 ఇయర్స్‌, 5 ఇయర్స్‌ ఎల్.ఎల్.బి మరియు ఎల్.ఎల్.ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్ష నిర్వహించనున్నారు. దరఖాస్తుల ప్రక్రియ ఫిబ్రవరి 10, 2026న ప్రారంభం అవుతుంది. లాసెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఏప్రిల్‌ 1 తో ముగుస్తుంది. దరఖాస్తుల సవరణ ప్రక్రియ మే 3 నుంచి మే 8 వరకు ఉంటుంది. ఇక మే 12 నుంచి హాల్‌ టికెట్లు జారీ చేస్తారు. మే 18వ తేదీన పరీక్ష నిర్వహిస్తారు. ఫీజు వివరాలు విషయానికి వస్తే.. సాధారణ అభ్యర్థులకు రూ. 900, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ. 600. PGLCET సాధారణ అభ్యర్థులకు రూ. 1100, ఎస్సీ/ఎస్టీ/పీహెచ్ అభ్యర్థులకు రూ. 900. మే 18న మొత్తం మూడు సెషన్లలో పరీక్ష జరుగుతుంది. ఉదయం 9:30 నుండి సాయంత్రం 5:30 వరకు వేర్వేరు కోర్సులకు షెడ్యూల్ ఖరారు చేశారు. ప్రాథమిక ‘కీ’ని మే 23న విడుదల చేసి, జూన్ 5న తుది ఫలితాలను ప్రకటించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించండి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..

ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..

పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు

విజయం సాధించాలని గణనాథుడిని ప్రార్థించిన టీమిండియా

మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివి షాకవుతున్న సిబ్బంది