AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హాంకాంగ్.. అదే ఉద్రిక్తత.. ఇంకా తగ్గని జన ఘోష.. వర్షంలోనే భారీ ప్రదర్శన

హాంకాంగ్ లో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది, నిరసన జ్వాలలు మండుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్య పునరుధ్ధరణ కోసం ఆందోళనకారులు భారీ ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. ఆదివారం వర్షం పడుతున్నప్పటికీ వెయ్యిమందికి పైగా నిరసనకారులు గొడుగులు చేతబట్టుకుని బ్రహ్మాండమైన పార్క్ లో ప్రదర్శనకు పూనుకొన్నారు. యువకులు, మహిళలు, వృధ్ధులు తమ ముఖాలు కనిపించకుండా.. సర్జికల్ మాస్కులు ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘ మేం హాంకాంగ్ వాసులం.. మా ఉద్యమం నిలిచిపోయే ప్రసక్తే లేదు.. మాకు అన్యాయం జరుగుతోంది.. మా విశ్వాసాలకు […]

హాంకాంగ్.. అదే ఉద్రిక్తత.. ఇంకా తగ్గని జన ఘోష.. వర్షంలోనే భారీ ప్రదర్శన
Anil kumar poka
|

Updated on: Dec 30, 2019 | 12:32 PM

Share

హాంకాంగ్ లో ఉద్రిక్తత ఇంకా కొనసాగుతోంది, నిరసన జ్వాలలు మండుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్య పునరుధ్ధరణ కోసం ఆందోళనకారులు భారీ ప్రదర్శనలు కొనసాగిస్తున్నారు. ఆదివారం వర్షం పడుతున్నప్పటికీ వెయ్యిమందికి పైగా నిరసనకారులు గొడుగులు చేతబట్టుకుని బ్రహ్మాండమైన పార్క్ లో ప్రదర్శనకు పూనుకొన్నారు. యువకులు, మహిళలు, వృధ్ధులు తమ ముఖాలు కనిపించకుండా.. సర్జికల్ మాస్కులు ధరించి ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ‘ మేం హాంకాంగ్ వాసులం.. మా ఉద్యమం నిలిచిపోయే ప్రసక్తే లేదు.. మాకు అన్యాయం జరుగుతోంది.. మా విశ్వాసాలకు వ్యతిరేకంగా జరుగుతోంది ‘ అని ఓ మహిళ ఆగ్రహంగా వ్యాఖ్యానించింది. గత ఏడెనిమిది నెలలుగా ఇక్కడ నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. . మొదట నేరస్థుల అప్పగింత బిల్లుకు, చైనా వైఖరికి నిరసనగా ఆందోళన జరిగింది. వీరి ఉద్యమ ఫలితంగా చివరకు ఆ బిల్లును ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

అయితే చైనా పాలన నుంచి తమకు పూర్తి విముక్తి కల్పించాలంటూ.. ప్రజాస్వామ్యాన్ని పునరుధ్ధరించాలంటూ ఆందోళనకారులు మళ్ళీ ప్రొటెస్టులు ప్రారంభించారు. తమ ప్రాంతంపై చైనా ఆధిపత్యం పూర్తిగా తొలగేంతవరకు ఈ ప్రొటెస్టులు కొనసాగిస్తామని అంటున్నారు. శనివారం కూడా ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించి.. పెప్పర్ స్ప్రే కూడా ఉపయోగించారు. అనేకమందిని అరెస్టు చేశారు. రానున్న రోజుల్లో తమ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తామని, న్యూ ఇయర్స్ డే కి కౌంట్ డౌన్ లాంచ్ చేస్తామని వారు ప్రకటించారు. 1997 లో తమ ప్రాంతం చైనా ఆధీనంలోకి వచ్చిందని, అప్పటినుంచీ తమకు కష్టాలు మొదలయ్యాయని వారు వాపోతున్నారు. మీకు స్వేఛ్చ ఇస్తామని నాడు బ్రిటిష్ ‘ కాలనీ ‘ హామీ ఇఛ్చినప్పటికీ చైనా మాత్రం తమను ‘ శని ‘ లా పట్టుకుని పీడిస్తోందని హాంకాంగ్ వాసులు ఆరోపిస్తున్నారు.