సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్
‘ఘూస్కోర్ పండత్’ సినిమా టైటిల్ వివాదంపై కథనం చర్చించింది. ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందని నిరసనలు, #BoycottNetflix ట్రెండింగ్, పోలీసు కేసులు నమోదయ్యాయి. కేంద్రం, NHRC జోక్యంతో నెట్‌ఫ్లిక్స్ ప్రచార సామగ్రిని తొలగించింది. మనోజ్ బాజ్‌పాయ్, నీరజ్ పాండే ఇది కల్పితమని వివరించినా, ప్రాజెక్ట్ నిలిపివేయబడింది. టైటిల్ ఎంపిక ఎంత ముఖ్యమో ఇది తెలియజేస్తుంది.
నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్ మనోజ్ బాజ్‌పాయ్, దర్శకుడు నీరజ్ పాండే కాంబినేషన్‌కు చాలా మంచి పేరుంది. వీరిద్దరూ కలిసి నెట్‌ఫ్లిక్స్ కోసం రూపొందించిన తాజా చిత్రం ‘ఘూస్కోర్ పండత్’. ఈ సినిమా విడుదల కాకముందే వివాదాల్లో చిక్కుకుంది. సినిమా టైటిల్ ఒక సామాజిక వర్గాన్ని కించపరిచేలా ఉందంటూ నిరసన తెలపడంతో నెట్‌ఫ్లిక్స్ నిర్ణయం తీసుకుంది. హిందీలో ‘ఘుస్కోర్’ అంటే లంచగొండి అని అర్థం. ఒక సామాజిక వర్గాన్ని సూచించే పదాన్ని ‘లంచగొండి’ అనే పదంతో కలిపి టైటిల్‌గా పెట్టడంపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఒక వర్గం పట్ల ద్వేషాన్ని పెంచేలా ఉందని మండిపడ్డారు. ఈ వివాదం ముదిరి #BoycottNetflix ట్రెండింగ్ అవుతోంది. లక్నో, ఢిల్లీలో పోలీసు కేసులు కూడా నమోదయ్యాయి. వివాదంపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ సీరియస్ అయ్యింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ నుంచి నోటీసులు రావడంతో పాటు, కంటెంట్‌ను వెంటనే తొలగించాలని కేంద్రం నెట్‌ఫ్లిక్స్‌ను ఆదేశించింది. దీంతో అప్రమత్తమైన నెట్‌ఫ్లిక్స్, సినిమాకు సంబంధించిన టీజర్, పోస్టర్లు, ఇతర ప్రమోషనల్ వీడియోలన్నింటినీ తన ప్లాట్‌ఫారమ్ నుంచి పూర్తిగా తొలగించింది. వివాదం పెద్దదవ్వడంతో దర్శకుడు నీరజ్ పాండే హీరో మనోజ్ బాజ్‌పాయ్ స్పందించారు. ఇది కేవలం ఒక కల్పిత కథ అని, ఎవరి మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని అన్నారు. సినిమాలో పాత్ర పేరునే టైటిల్‌గా పెట్టామని, అంతేకానీ అది ఏ కులానికో, మతానికో సంబంధించింది కాదని వివరణ ఇచ్చారు. అయినప్పటికీ, ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన కంటెంట్‌ను నెట్‌ఫ్లిక్స్ హోల్డ్‌లో పెట్టింది. సినిమా టైటిల్‌ను మారుస్తారా లేక కథలో ఏవైనా మార్పులు చేస్తారా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఒక గొప్ప నటుడు, మంచి దర్శకుడు ఉన్నప్పటికీ, కేవలం టైటిల్ ఎంపికలో జరిగిన పొరపాటు వల్ల ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇబ్బందుల్లో పడింది. గతంలో తెలుగులో కూడా ‘వాల్మీకి’ టైటిల్ విషయంలో ఇలాంటి కాంట్రవర్సీనే నడిచింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు
లక్కీ ఇండియన్.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు

