AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం

దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం

Phani CH
|

Updated on: Feb 08, 2026 | 6:06 PM

Share

ఫిబ్రవరి 7న ఓలా, ఉబర్, ర్యాపిడో సేవలు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు కనీస ఛార్జీలు, మెరుగైన పని పరిస్థితుల కోసం సమ్మెకు దిగారు. అగ్రిగేటర్లు డ్రైవర్లను శ్రమదోపిడీకి గురిచేస్తున్నారని ఆరోపిస్తూ, ప్రైవేట్ వాహనాల వాడకంపై నిషేధం డిమాండ్ చేశారు. 'ఎకనామిక్ సర్వే' గిగ్ వర్కర్ల దయనీయ స్థితిని వెల్లడించగా, 'భారత్ టాక్సీ' భవిష్యత్తుపై కొత్త చర్చను రేకెత్తించింది.

ఓలా, ఉబర్, ర్యాపిడో వాహనాల సర్వీసులు శనివారం ఫిబ్రవరి 7న కొంత సేపు నిలిచిపోయాయి. దేశవ్యాప్తంగా క్యాబ్ ఆటో బైక్‌టాక్సీ సర్వీసులకి అంతరాయం ఏర్పడింది. కనీస చార్జీలు డ్రైవర్ల పని పరిస్థితులపై తమ సమస్యలకు పరిష్కారం కోసం గిగ్ వర్కర్లు దేశవ్యాప్త స్ట్రైక్‌కు పిలుపునిచ్చారు. ‘ఆల్ ఇండియా బ్రేక్ డౌన్’ పేరుతో నిరసనలో రైడర్లందరూ ఉదయం 6 గంటల పాటు యాప్‌ నుంచి లాగ్-అవుట్ అయ్యారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరాటానికి జాతీయ కార్మిక సంఘాలు మద్దతు తెలిపాయి. ముఖ్యంగా అగ్రిగేటర్ సంస్థలు ఇష్టానుసారంగా ఛార్జీలను నిర్ణయిస్తూ డ్రైవర్లను శ్రమదోపిడీకి గురిచేస్తున్నాయని యూనియన్ ఆరోపిస్తోంది. క్యాబ్‌ సేవలను నియంత్రించేందుకు తీసుకొచ్చిన ‘మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్‌లైన్స్-2025’ అమల్లో ఉన్నప్పటికీ ఇష్టానుసారంగా చార్జీలు నిర్ణయిస్తున్నాయనీ, ప్రభుత్వం కనీస ఛార్జీలను నోటిఫై చేయకపోవడం వల్ల డ్రైవర్ల ఆదాయం దారుణంగా పడిపోయిందని అంటున్నారు. అంతేకాకుండా, ప్రైవేట్ నంబర్ ప్లేట్ వాహనాలను కమర్షియల్ అవసరాలకు వాడటం వల్ల లైసెన్స్ ఉన్న డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటోందని, దీనిపై తక్షణమే నిషేధం విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా విడుదలైన ‘ఎకనామిక్ సర్వే 2025-26’ సైతం గిగ్ వర్కర్ల దయనీయ స్థితిని ఎత్తిచూపింది. దేశంలో సుమారు 40 శాతం మంది గిగ్ వర్కర్లు నెలకు రూ. 15,000 కంటే తక్కువ ఆదాయంతో సరిపెట్టుకుంటున్నట్లు సర్వే తెలిపింది. మరోవైపు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ‘భారత్ టాక్సీ’ అనే సహకార ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించడం ఈ రంగంలో కొత్త చర్చకు దారితీసింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??

టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే

అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..

ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..

పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు