అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
నార్వే సరికొత్త గాజు పనోరమిక్ నైట్ ట్రైన్‌ను ప్రారంభించింది. 'మిడ్‌నైట్ అరోరా రూట్' పేరుతో నడిచే ఈ రైలు, ఉత్తర ధ్రువపు కాంతులను (నార్తర్న్ లైట్స్) 360 డిగ్రీల కోణంలో వీక్షించే అద్భుత అనుభూతినిస్తుంది. గాజు గోడలు, పైకప్పుతో కూడిన ఈ ట్రైన్, నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు అరోరా బోరియాలిస్‌ను చూడటానికి సరైన మార్గం. హైడ్రో ఎలక్ట్రిక్ శక్తితో నడిచే ఇది ప్రపంచ పర్యాటకులను ఆకర్షిస్తోంది.
బస్సులోనో, ట్రైన్‌లోనో వెళ్తున్నప్పుడు కిటికీ వద్దే కూర్చుంటామని మారాం చేసే పిల్లల్ని చూస్తాం. కిటికీ దగ్గరి సీటులో కూర్చున్న వారికే కాకుండా.. ట్రైన్‌లో కూర్చున్న వారందరికీ బయటి పరిసరాలు కనిపించే ఏర్పాట్లు ట్రైన్‌లో ఉంటే ఎంత బాగుంటుందో కదా అనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ కలను నిజం చేసింది నార్వే ప్రభుత్వం. మొదటిసారిగా గాజు కిటికీలతో పానొరమిక్ నైట్ ట్రైన్‌ను ప్రారంభించింది నార్వే దేశం. మిడ్‌నైట్ అరోరా రూట్ అని దీనికి పేరు పెట్టారు. ఇది ప్రత్యేకంగా నార్తర్న్ లైట్స్ చూసే పర్యాటకుల కోసం అందిస్తున్నారు. అక్టోబర్ నుంచి మార్చి వరకు నార్వేలోని ఆర్క్‌టిక్ ప్రాంతంలో నార్తర్న్ లైట్స్ కనువిందు చేస్తాయి. ప్రతి సంవత్సరం నార్వేజియన్ నగరమైన ట్రోమ్సోకు నార్తర్న్ లైట్స్‌ను చూడటానికి చాలా మంది వస్తారు. దీనిని అరోరా బోరియాలిస్ అని కూడా పిలుస్తారు. ఈ లైట్స్ చూడటానికి నవంబర్ నుంచి ఫిబ్రవరి అనువైన సమయం. ఈ సమయంలో రాత్రులు చాలా ఎక్కువగా ఉంటాయి. పానరమిక్ నైట్ ట్రైన్‌లోని బోగీలు పూర్తిగా గాజు గోడలు, గాజు పైకప్పుతో ఉంటాయి. దీనివల్ల ప్రయాణికులు ట్రైన్ లోపల ఉంటూనే బయటి పరిసరాలన్నీ చూడొచ్చు. ఆకాశం అంతటా పరుచుకునే అరోరా రంగులు.. మెరిసే నక్షత్రాలు, కదులుతున్న మేఘాలు, పర్వతాల నడుమ జలపాతాన్ని 360 డిగ్రీల కోణంలో స్పష్టంగా చూడవచ్చు. అసలే చలిగా ఉండే ఈ ప్రాంతంలో వెచ్చదనం కోసం ట్రైన్‌లో ఏర్పాట్లు చేసారు. ట్రైన్ లోపల హీటెడ్ సీట్లు, బ్లాంకెట్లు వంటివి ముందుగానే సెట్ చేసి పెడతారు. హైడ్రో ఎలక్ట్రిక్ శక్తితో నడిచే ఈ ట్రైన్ ప్రపంచవ్యాప్త టూరిస్టులను ఆకర్షిస్తోంది. నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, గ్రీన్‌లాండ్, కెనడా, అలాస్కా మీదుగా ట్రైన్ ప్రయాణం పర్యాటకులకు మరచిపోలేని అనుభూతినిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టీజీ లాసెట్ నోటిఫికేషన్ విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల విహార యాత్రలో ఒక్కసారిగా కలకలం.. ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు

