ఫిబ్రవరి 15 నుంచి బ్యాంక్ రూల్స్‌లో మార్పు
ఎస్‌బీఐ తన ఖాతాదారులకు షాకిచ్చింది. 2026 ఫిబ్రవరి 15 నుండి ఆన్‌లైన్ IMPS క్యాష్ ట్రాన్స్‌ఫర్ సేవలపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేయనుంది. రూ.25,000 వరకు ఉచితం కాగా, ఆ పైన లావాదేవీలకు శ్లాబుల వారీగా ఛార్జీలు వర్తిస్తాయి. కొన్ని శాలరీ ఖాతాలకు మినహాయింపు ఉంది. NEFT, RTGS మాత్రం ఉచితంగానే కొనసాగుతాయి. ఈ కొత్త నిబంధనలు వినియోగదారులపై ప్రభావం చూపుతాయి.
ఎస్‌బీఐ తన ఖాతాదారులకు షాకిచ్చింది. ఇప్పటి వరకు ఆన్‌లైన్ ద్వారా ఉచితంగా అందుబాటులో ఉన్న IMPS క్యాస్ ట్రాన్సఫర్ సేవలపై సర్వీస్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ కొత్త నిబంధనలు 2026, ఫిబ్రవరి 15 నుంచి అమలులోకి రానున్నాయి. సాధారణంగా అత్యవసర నగదు బదిలీల కోసం వినియోగించే IMPS సేవలపై బ్యాంక్ పరిమితులను విధించింది. దీని ప్రకారం.. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ , యోనో యాప్ ద్వారా చేసే లావాదేవీలకు ఈ ఛార్జీలు వర్తిస్తాయి. రూ. 25,000 వరకు ఎటువంటి ఛార్జీలు ఉండవు. రూ.25,001 నుంచి రూ.1,00,000 వరకు రూ.2 ప్లస్ జీఎస్‌టీ, రూ.1,00,001 నుంచి రూ. 2,00,000 వరకు రూ.6 ప్లస్ జీఎస్‌టీ, రూ.2,00,001 నుంచి రూ.5,00,000 వరకు రూ.10 ప్లస్ జీఎస్‌టీ చార్జ చేయనున్నారు. రూ.25 వేల లోపు చేసే లావాదేవీలపై ఎటువంటి ఛార్జీలు విధించకపోవడం సామాన్య వినియోగదారులకు కొంత ఊరట కలిగించే అంశం. నేరుగా బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లి చేసే IMPS ఛార్జీలలో ఎటువంటి మార్పు లేదు. అవి పాత పద్ధతిలోనే రూ.2 నుంచి రూ.20 వరకు కొనసాగుతాయి. డిఫెన్స్, కేంద్ర ప్రభుత్వం, రైల్వే, పోలీసు సిబ్బందికి చెందిన శాలరీ అకౌంట్లకు, అలాగే కొన్ని ప్రత్యేక సేవింగ్స్ ఖాతాలకు మాత్రం ఈ ఛార్జీల నుంచి మినహాయింపు ఉంటుంది. డిజిటల్ పద్ధతిలో చేసే NEFT, RTGS లావాదేవీలు యథావిధిగా ఉచితంగానే కొనసాగుతాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి
సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

