AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sreeleela: పాపం.. శ్రీలీలకు ఎంత కష్టం వచ్చిందో..?

Sreeleela: పాపం.. శ్రీలీలకు ఎంత కష్టం వచ్చిందో..?

Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Feb 08, 2026 | 7:17 PM

Share

టాలీవుడ్‌లో వరుస పరాజయాలతో శ్రీలీలకు అవకాశాలు తగ్గుతున్నాయా? ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మినహా తెలుగులో పెద్దగా సినిమాలు లేవు. ఆమె దృష్టి కోలీవుడ్, బాలీవుడ్ వైపు మళ్లుతోంది. ఇప్పటికే ధనుష్‌తో సినిమాతో తమిళంలో బిజీ అవుతోంది. తెలుగులో గుర్తింపు వచ్చినా, ఆమె కెరీర్ మలుపు తిరుగుతుందా అనేది చర్చనీయాంశం.

శ్రీలీలకు టాలీవుడ్‌లో అవకాశాలు ఇక రానట్లేనా..? అందుకే ఆమె ఇండస్ట్రీ మార్చేస్తున్నారా..? ఇకపై అమ్మడి ఫోకస్ అంతా చెన్నైపైనే ఉండబోతుందా..? అందుకే తెలుగు కాదని తమిళ సినిమాలపై ఎక్కువగా కాన్సట్రేట్ చేస్తున్నారా..? అసలేంటి సంగతి.. తెలుగమ్మాయికు తమిళ ఇండస్ట్రీ కలిసొస్తుందా..? శ్రీలీలకు తెలుగులో రావాల్సిన దానికంటే ఎక్కువ గుర్తింపే వచ్చింది.. కొన్నిసార్లు విజయాలు తక్కువగానే ఉన్నా అవకాశాలు మాత్రం అదిరిపోయాయి. రెండేళ్ళ పాటు గుక్క తిప్పుకోకుండా సినిమాలు చేసారు ఈ బ్యూటీ. ఈ మధ్యే కాస్త ఖాళీగా మారిపోయారు ఈ డాక్టర్ గారు. ప్రస్తుతం ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే తెలుగులో శ్రీలీల చేస్తున్న సినిమా. ఉస్తాద్ కూడా ఇప్పుడు సైన్ చేసిన సినిమా కాదు.. ఏడాదిన్నర కిందే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారు శ్రీలీల. ఇది మినహా తెలుగులో పెద్దగా సినిమాలు చేయట్లేదు ఈ బ్యూటీ. పైగా వరస ఫ్లాపులు బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ టైమ్‌లో శ్రీలీల ఫోకస్ అంతా తమిళ, హిందీ వైపు వెళ్తుంది. ఇప్పటికే తమిళంలో పరాశక్తితో డెబ్యూ చేసారు శ్రీలీల. పరాశక్తి ప్లాప్ అయినా.. తమిళం నుంచి శ్రీలీలకు ఆఫర్స్ మొదలయ్యాయి. తాజాగా ధనుష్, రాజ్ కుమార్ పెరియసామి సినిమాలో సాయి పల్లవితో పాటు మరో హీరోయిన్‌గా ఎంపికయ్యారు ఈ భామ. మరిన్ని సినిమాలు కూడా ఈ భామ చెంతకు వస్తున్నాయి. గతంలో కృతి శెట్టి, తమన్నా, మీనాక్షి చౌదరి ఇలా చాలా మంది హీరోయిన్లు ముందు తెలుగు.. ఆ తర్వాత తమిళంలో బిజీ అయ్యారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Sri Vishnu: శ్రీ విష్ణు కెరీర్‌కు విచిత్రమైన సమస్య.. ఎలా డీల్ చేస్తారో..?

Spirit: ప్రభాస్‌కు సందీప్ రెడ్డి వంగా కండిషన్.. అదే..

Balakrishna: బాలయ్య రెడీ.. ఇక దండయాత్రే బ్యాలెన్స్

ఫిబ్రవరి 15 నుంచి బ్యాంక్‌ రూల్స్‌లో మార్పు

నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి

Published on: Feb 08, 2026 07:15 PM