Balakrishna: బాలయ్య రెడీ.. ఇక దండయాత్రే బ్యాలెన్స్
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో NBK111 సినిమా సిద్ధమవుతోంది. మాస్ జానర్‌లో ఈ చిత్రం సంక్రాంతి 2027 టార్గెట్‌గా రానుంది. గత సినిమాలతో మాస్ మొగుడిగా పేరు తెచ్చుకున్న బాలయ్య, ఈసారి అంతకుమించి యాక్షన్ ప్లాన్‌తో వస్తున్నారు. షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. ఫ్యాన్స్‌కు పండగే!
పోయిన చోటే వెతుక్కోవాలి అంటుంటారు కదా..? బాలయ్య కూడా ఇదే చేస్తున్నారిప్పుడు. ఎక్కడైతే ట్రాక్ తప్పారో.. అక్కడే మళ్లీ రికార్డులు కొడతానంటున్నారు. దానికోసం గోపీచంద్ మలినేనితో కలిసి నెక్ట్స్ లెవల్ ప్లాన్‌తో సిద్ధమయ్యారు NBK. మరి కొత్త సినిమా కోసం నటసింహం వేస్తున్న ఆ ప్లానింగ్ ఏంటో చూద్దామా..? అవును.. బాలయ్య అంటేనే మాస్ మొగుడు.. అఖండ నుంచి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టి.. మొన్నటి వరకు రచ్చ చేసారీయన. అఖండ 2తో కాస్త బ్రేకులు పడినా.. దానికి కూడా ఓపెనింగ్స్ అదిరిపోయాయి. సినిమా ఫ్లాప్ అయినా.. బాలయ్య నట విశ్వరూపంతో పండగ చేసుకున్నారు ఫ్యాన్స్. అందుకే మళ్లీ మాస్ వైపే అడుగులేస్తున్నారు బాలయ్య. అఖండ నుంచి బాలయ్య పూర్తిగా కేరాఫ్ మాస్ అయిపోయారు. వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకూమహారాజ్, అఖండ 2 అన్నీ మాస్ సినిమాలే. నెక్ట్స్ గోపీచంద్‌తో వీటన్నింటినీ మించిన మాస్ స్క్రిప్ట్ రెడీ అయింది. ఈసారి స్క్రీన్ అంతా రక్తంతో తడిసిపోవడం ఖాయం అంటున్నారు వీరసింహారెడ్డి జోడీ. పైగా క్రాక్, జాట్ అంటూ గోపీచంద్ కూడా మాస్ టచ్‌లోనే ఉన్నారిప్పుడు. నిజానికి అఖండ 2 తర్వాత పీరియడ్ వార్ డ్రామా చేయాలనుకున్నారు బాలయ్య. కానీ అనివార్య కారణాలతో ఆ కథను పక్కనబెట్టి.. పక్కా కమర్షియల్ సబ్జెక్ట్‌తోనే వస్తున్నారు. మార్చి నుంచి NBK111 రెగ్యులర్ షూట్ మొదలు కానుంది. సంక్రాంతి 2027 టార్గెట్‌గా పెట్టుకున్నారు గోపీచంద్ మలినేని. గతంలో వీరసింహారెడ్డి సైతం పొంగల్‌కే వచ్చింది. మొత్తానికి మరోసారి మాస్‌నే నమ్ముకుంటున్నారు బాలయ్య.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఫిబ్రవరి 15 నుంచి బ్యాంక్ రూల్స్‌లో మార్పు
నోట్లో పేలిన సెల్‌ఫోన్ బ్యాటరీ.. యువకుడు మృతి
సినిమా పేరుపై సాధువుల మండిపాటు.. పేరు మార్చాలని డిమాండ్
దేశవ్యాప్తంగా నిలిచిపోయిన ఓలా, ఉబర్ సేవలు.. కారణం
అద్దాల ట్రైన్‌లో అందమైన జర్నీ.. ఆకాశమంతా మీదే..! ఎక్కడంటే ??
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

