క్యారెట్లలో అనేక పోషకాలు ఉంటాయి. మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలకు క్యారెట్లు నెలవు. క్యారెట్లను రోజుకు ఒకటి చొప్పున తిన్నా చాలు ఎంతో లాభం.
క్యారెట్లలో బీటా క్యారోటిన్ శరీరంలో విటమిన్ A గా మారుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్యారెట్ తింటే సీజనల్ ఇన్ఫెక్షన్ల బారి నుంచి కాపాడుతుంది.
క్యారెట్లలో బీటాకెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ ఎ గా మారుతుంది. దీని వల్ల కంటి చూపు మెరుగు పడుతుంది. రేచీకటి సమస్య కూడా ఉండదు.
క్యారెట్లలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక వ్యవస్థను పటిష్టంగా మారుస్తుంది. దీంతో శరీరం ఇన్‌ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.
క్యారెట్లలో బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని సూర్యకాంతి నుంచి రక్షిస్తాయి. చర్మం ముడతలను తగ్గిస్తాయి. దీంతో ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపిస్తారు.
క్యారెట్లలో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల రోజుకు ఒక క్యారెట్‌ను తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. దీంతో మలబద్దకం తగ్గుతుంది.
క్యారెట్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. దీంతో బీపీ నియంత్రణలో ఉంటుంది.
క్యారెట్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో హార్ట్ ఎటాక్ రాకుండా అడ్డుకోవచ్చు.