ఇది పాక్‌ క్రికెటర్ అఫ్రీది తీరు.. కూతురు హిందూ ఆచారం పాటించిందని…

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొద్ది రోజులుగా ఇండియాపై ట్విట్టర్‌ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే అతనికి అంతే ధీటుగా మన ఇండియన్ మాజీ ఓపెనర్ గంభీర్ కూడా కౌంటర్ ఎటాక్ చేస్తూ వచ్చాడు. అయితే తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చెప్పిన నిజాలతో అఫ్రీది అసలు రూపం బయటపడింది. గతంలో పాక్ జట్టులో ఉన్న ఏకైక హిందూ క్రికెటర్‌ అయిన డానిష్‌ […]

ఇది పాక్‌ క్రికెటర్ అఫ్రీది తీరు.. కూతురు హిందూ ఆచారం పాటించిందని...
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Dec 30, 2019 | 2:13 PM

పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రీది గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొద్ది రోజులుగా ఇండియాపై ట్విట్టర్‌ ద్వారా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే అతనికి అంతే ధీటుగా మన ఇండియన్ మాజీ ఓపెనర్ గంభీర్ కూడా కౌంటర్ ఎటాక్ చేస్తూ వచ్చాడు. అయితే తాజాగా పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ చెప్పిన నిజాలతో అఫ్రీది అసలు రూపం బయటపడింది. గతంలో పాక్ జట్టులో ఉన్న ఏకైక హిందూ క్రికెటర్‌ అయిన డానిష్‌ కనేరియాపై ఎంతటి మత వివక్ష చూపేవారో.. అక్తర్ చెప్పడంతో ప్రపంచానికి తెలిసింది. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చజరుగుతోంది. ఇదిలా ఉంటే.. అఫ్రీదికి ఇండియా అన్నా.. హిందూ సంప్రదాయం అన్నా.. ఎంతలా ఎగతాళి చేస్తాడన్నదానికి సంబంధించిన ఓ వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ చర్చ ఇలా కొనసాగుతుండగానే.. మరో విషయాన్ని అఫ్రీదీనే చెప్పుకొచ్చాడు. తన కూతురు ఇంట్లో టీవీ ముందు.. హిందూ సంప్రదాయం ప్రకారం హారతి ఇచ్చినందుకు తాను టీవీని ఎలా పగలకొట్టిందీ వివరించాడు.

హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌లో వచ్చే సీరియళ్లను కూతురుతో కాకుండా ఒంటరిగా చూడమని నా భార్యకు చెబుతుంటానని.. అయితే ఒకసారి నేను బయట నుంచి ఇంటికి వచ్చే సరికి నా కూతురు టీవీలో వస్తున్న హారతిని ఇచ్చే సన్నివేశాన్ని చూస్తూ.. తాను కూడా అలానే చేస్తూ ఉందని.. దీంతో నాకు చిర్రెత్తుకొచ్చి ఆ టీవీని పగలగొట్టా’ అంటూ అఫ్రిదీ తెలిపాడు. అయితే దీనికి సబంధించిన ఆ డిస్కషన్ బిట్‌ను ఒకరు ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా అది కాస్త వైరల్‌గా మారింది. అఫ్రీది వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు.