ఎదురీత ముందు విధిరాత ఎంత..?

వైకల్యం మనిషి జీవితానికి అడ్డా..ఎంతమాత్రం కాదు. ఆ విషయాన్ని కళ్లకు కట్టాడు ఓ బుడతడు. రెండు కాళ్లలో పటుత్వం లేకపోయినా..గల్లీ క్రికెట్‌లో హీరోగా మారాడు. బుడ్డోడి బ్యాటింగ్, వికెట్ల మధ్య పరిగెత్తే విధానం చూస్తే మనలో ఉన్న బద్దకం కూడా ఒక్క ఉదుటన మాయమవుతుంది. మీలోకి కొత్త శక్తి ప్రవహిస్తుంది.  ఐఎఫ్ఎస్ అధికారి సుధారేమాన్ సదరు చిచ్చర పిడుగు వీడియోను ట్వీట్ చేశారు. ఏ ప్రాంతానికి చెందిన పిల్లాడే తెలియదు కానీ..ఆ వీడియో ఇంటర్నెట్ వ్యాప్తంగా వైరల్‌గా […]

ఎదురీత ముందు విధిరాత ఎంత..?
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 29, 2019 | 3:28 PM

వైకల్యం మనిషి జీవితానికి అడ్డా..ఎంతమాత్రం కాదు. ఆ విషయాన్ని కళ్లకు కట్టాడు ఓ బుడతడు. రెండు కాళ్లలో పటుత్వం లేకపోయినా..గల్లీ క్రికెట్‌లో హీరోగా మారాడు. బుడ్డోడి బ్యాటింగ్, వికెట్ల మధ్య పరిగెత్తే విధానం చూస్తే మనలో ఉన్న బద్దకం కూడా ఒక్క ఉదుటన మాయమవుతుంది. మీలోకి కొత్త శక్తి ప్రవహిస్తుంది.  ఐఎఫ్ఎస్ అధికారి సుధారేమాన్ సదరు చిచ్చర పిడుగు వీడియోను ట్వీట్ చేశారు. ఏ ప్రాంతానికి చెందిన పిల్లాడే తెలియదు కానీ..ఆ వీడియో ఇంటర్నెట్ వ్యాప్తంగా వైరల్‌గా మారింది.

రోప్స్ కట్టి గ్రాఫిక్స్‌లో వాటిని తీసేసి..రీల్ హీరోస్ సింహంలా వస్తుంటే ఆశ్యర్యపోయి విజిల్స్ వేస్తారు. మరి ఇక్కడ రియల్ హీరో చేస్తోన్న పరుగులకు ఎన్ని విజిల్స్ వేస్తారన్నది మీ మనసుకే వదిలేస్తున్నాం. చేయాలన్న కసి, సాధించాలన్న తపన..మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తాయి. సండే రోజున ఈ మోటివేషనల్ వీడియో స్పిరిట్‌తో కొత్త ఆశలు దిశగా ప్రయాణం ప్రారభించండి.