మంచు అలెర్ట్: 500 విమానాల షెడ్యూల్ మార్చిన ఢిల్లీ ఎయిర్‌పోర్ట్!
తీవ్రమైన పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకల షెడ్యూల్‌ను అధికారులు మార్చారు. దాదాపు 500ల ఫ్లైట్స్ రాకపోకల్లో ఆలస్యంగా జరుగుతుందని, కాగా 21 విమానాలను దారి మళ్లించామని, మరో 5 విమాన సర్వీసులను రద్దు చేశామని వారు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో శీతల గాలులు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సున్నా, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆయా రాష్ట్రాల్లో […]
తీవ్రమైన పొగమంచు కారణంగా ఢిల్లీ ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకల షెడ్యూల్‌ను అధికారులు మార్చారు. దాదాపు 500ల ఫ్లైట్స్ రాకపోకల్లో ఆలస్యంగా జరుగుతుందని, కాగా 21 విమానాలను దారి మళ్లించామని, మరో 5 విమాన సర్వీసులను రద్దు చేశామని వారు తెలిపారు.
దక్షిణాది రాష్ట్రాలు చలికి వణికిపోతున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, బీహర్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో శీతల గాలులు కమ్మేయడంతో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో సున్నా, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో ఆయా రాష్ట్రాల్లో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ చలి గుప్పిట్లో చిక్కుకుపోయింది. 2.4 డిగ్రీల ఉష్టోగ్రతగా నమోదైంది. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ చలి వణికిస్తున్నది. వాతావరణంలో దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా.. జమ్మూకశ్మీర్‌లో -6.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక హర్యానాలో రెండు రోజుల పాటు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది ఈ ప్రభుత్వం.
Delhi Airport Official: Over 500 flights delayed, 21 diverted; 5 flights cancelled due to dense fog at Delhi Airport.
— ANI (@ANI) December 30, 2019