Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ దేశాన్ని శాసిస్తోన్న పీఎం..ఓ ఇండియన్ సన్..

‘బ్రహ్మోత్సవం’ సినిమా చూసే ఉంటారు. అందులో మహేశ్ బాబు తన పూర్వీకుల మూలలను వెతుకుతూ ప్రయాణం సాగిస్తూ ఉంటారు. తమ మూలాలు ఎక్కడ ప్రారంభమయ్యాయ్..వారు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు అనే అంశాలను తెలుసుకోడానికి అతని ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ సినిమాగానే వర్కవుట్ కాలేదు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో తమ పనులు మానేసుకుని తమ పూర్వికులు నివశించిన సొంతూరు మూలాలను వెతుక్కుంటూ వెళ్లే వారు ఎవరుంటారు. కానీ ఓ దేశ ప్రధాని తన సొంతూరు చూడటానికి అత్యంత […]

ఓ దేశాన్ని శాసిస్తోన్న పీఎం..ఓ ఇండియన్ సన్..
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 30, 2019 | 4:38 PM

‘బ్రహ్మోత్సవం’ సినిమా చూసే ఉంటారు. అందులో మహేశ్ బాబు తన పూర్వీకుల మూలలను వెతుకుతూ ప్రయాణం సాగిస్తూ ఉంటారు. తమ మూలాలు ఎక్కడ ప్రారంభమయ్యాయ్..వారు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు అనే అంశాలను తెలుసుకోడానికి అతని ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ సినిమాగానే వర్కవుట్ కాలేదు. ఇప్పుడున్న బిజీ లైఫ్‌లో తమ పనులు మానేసుకుని తమ పూర్వికులు నివశించిన సొంతూరు మూలాలను వెతుక్కుంటూ వెళ్లే వారు ఎవరుంటారు. కానీ ఓ దేశ ప్రధాని తన సొంతూరు చూడటానికి అత్యంత సాదాసీదాగా ఇండియాకు వచ్చారంటే నమ్ముతారా..?. అవును మీరు వింటున్నది నిజమే. అలా వచ్చింది ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్.

వివరాల్లోకి వెళ్తే..లియో వరద్కర్ తండ్రి అశోక్ వరద్కర్‌.. మహారాష్ట్రలో సింధుదుర్గ్‌ జిల్లా మాల్వన్ తాలూకా వరద్​గావ్‌లో నివశించేవారు. ఆ ప్రాంతంలో ఆయనకు వైద్యుడిగా మంచి పేరుంది.  1960 సమయంలో అశోక్ ఇండియా నుంచి ఐర్లాండ్‌కి వలసవెళ్లారు. అక్కడి మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆ జంట కుమారుడే ప్రస్తుత ఐర్లాండ్ ప్రధాని లియో వరద్కర్.

ఈ క్రమంలో ఇండియాకు ఫ్యామిలీతో కలిసి వచ్చిన లియో వరద్కర్ తన సొంతూరుకు వెళ్లారు. అక్కడ గ్రామస్థుల బాగోగులు తెలుసుకున్నారు. స్థానికంగా నివశించే శ్రీ దేవ్ వెబోటా ఇంట్లో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత వారి బంధువైన మాల్వానీ ఇచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు.   ఐర్లాండ్​లోని ఫైన్​ గేల్​ అనే పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు లియో. 2017 జూన్​లో ప్రధానిగా గెలుపొందారు.