పౌరసత్వ చట్టానికి నిరసన …. మంగుళూరులో ఆ నాడు ఏం జరిగింది ?
సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కర్నాటకలోని మంగుళూరులో డిసెంబరు 19 న హింసాత్మక నిరసనకు పాల్పడిన మూకలను గుర్తించారు పోలీసులు.. వారిలో అనేకమంది పెద్ద ఎత్తున పోలీసులపై రాళ్ళ వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఖాకీలు తప్పనిసరిగా తమ తుపాకులకు పని చెప్పక తప్పలేదు. సుమారు 150 నుంచి 200 మంది ఆందోళనకారులు ఒక చోట గుమి కూడి ఒక్కసారిగా వారిపై రాళ్లు విసరనారంభించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించక పోగా […]
సవరించిన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కర్నాటకలోని మంగుళూరులో డిసెంబరు 19 న హింసాత్మక నిరసనకు పాల్పడిన మూకలను గుర్తించారు పోలీసులు.. వారిలో అనేకమంది పెద్ద ఎత్తున పోలీసులపై రాళ్ళ వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో ఖాకీలు తప్పనిసరిగా తమ తుపాకులకు పని చెప్పక తప్పలేదు. సుమారు 150 నుంచి 200 మంది ఆందోళనకారులు ఒక చోట గుమి కూడి ఒక్కసారిగా వారిపై రాళ్లు విసరనారంభించారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించక పోగా వారు మరింత రెచ్చిపోయారు. దీంతో పెద్ద బండ రాళ్లను అడ్డు పెట్టుకుని వాటి చాటున ఖాకీలు ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు నిరసనకారులు మరణించగా.. మరికొంతమంది గాయపడ్డారు. అయితే హింసకు పాల్పడిన ఆ మూకలోని వారంతా ముస్లిం యువకులేనని తాజాగా పోలీసులు తమ ఎఫ్ఐ ఆర్ లో పేర్కొన్నారు. వారి పేర్లు, వయస్సులతో సహా ఖాకీలు ఈ ఎఫ్ ఐ ఆర్ లో వివరించారు. ఆ గుంపులో చాలామంది ధరించిన డ్రెస్ ఆధారంగా వారు ముస్లిములేనని రూఢి పరచుకున్నామని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇలా ఉండగా.. శాంతియుతంగా ఆందోళన జరుపుతున్న నిరసనకారులపై పోలీసులు కావాలనే కాల్పులు జరిపారని మంగుళూరులోని ముస్లిం సంఘాలు ఆరోపించాయి. వారు ఒకవర్గాన్ని టార్గెట్ చేశారని, అమాయకుల మీద కూడా తుపాకులను ఎక్కుపెట్టారని ఈ సంఘాల నేతలు పేర్కొన్నారు. మరోవైపు… తమపై రాళ్ల వర్షం కురిపించిన వారి ఫోటోలను, వీడియోలను పోలీసులు విడుదల చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.