లేటు వయసులో ప్రేమ పెళ్లి.. చూతము రారండి !

లవ్ కి హద్దులు, వయసు తారతతమ్యాలు లేవంటే ఇదేనేమో ! ఓల్డ్ ఏజ్ లోనూ ఇద్దరి మనసు.. మనసు.. కనులు.. కనులు కలిస్తే.. ఇక కళ్యాణానికి కాలం కలిసొచ్చినట్టే ! కేరళలోని ఓ వృధ్ధ జంట ప్రేమ దీన్ని నిరూపిస్తోంది. ఆయన పేరు.. కొచనియన్ మీనన్.. వయస్సు 67 సంవత్సరాలు.. ఆమె పేరు లక్ష్మీ అమ్మాళ్.. ఏజ్..’ 65 ‘ మాత్రమే ‘ ! ఇద్దరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నప్పుడే వారి మనస్సుల్లో ‘ […]

లేటు వయసులో ప్రేమ పెళ్లి.. చూతము రారండి !
Follow us
Anil kumar poka

|

Updated on: Dec 30, 2019 | 2:20 PM

లవ్ కి హద్దులు, వయసు తారతతమ్యాలు లేవంటే ఇదేనేమో ! ఓల్డ్ ఏజ్ లోనూ ఇద్దరి మనసు.. మనసు.. కనులు.. కనులు కలిస్తే.. ఇక కళ్యాణానికి కాలం కలిసొచ్చినట్టే ! కేరళలోని ఓ వృధ్ధ జంట ప్రేమ దీన్ని నిరూపిస్తోంది. ఆయన పేరు.. కొచనియన్ మీనన్.. వయస్సు 67 సంవత్సరాలు.. ఆమె పేరు లక్ష్మీ అమ్మాళ్.. ఏజ్..’ 65 ‘ మాత్రమే ‘ ! ఇద్దరూ ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉన్నప్పుడే వారి మనస్సుల్లో ‘ మన్మథుడు పూల బాణాలు విసిరినట్టున్నాడు .’ ఇద్దరూ ప్రేమలో పడిపోయారు. ఎంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారో గానీ.. ఇక తమ ప్రేమకు ఫుల్ స్టాప్ పెట్టి పెళ్లితో ఒక్కటవుదామని అనుకున్నారు. ఆ వృధ్ధాశ్రమ నిర్వాహకులు వీరి వైనం తెలిసి మొదట ఆశ్చర్యపోయినా.. ఆ తరువాత వీరి కోర్కెను సంతోషంగా అంగీకరించారు. త్రిసూర్ లోని రామవరంపురంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓల్డ్ ఏజ్ హోమ్ లో మీనన్, లక్ష్మీ అమ్మాళ్ పెళ్లి గత శనివారం ఘనంగా జరిగింది. ‘ వరుడు ‘ తెల్లని దుస్తుల్లో, ‘ వధువు ‘ ఎర్రని చీర, దానికి మ్యాచ్ అయ్యే జాకెట్ ధరించి పెళ్లి పీటలెక్కారు. అమ్మలక్కల ఆప్యాయతలు, అభిమానాల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. ట్విటర్ లో ఈ జంట వెడ్డింగ్ ఫోటోలు వైరల్ కాగా.. ఇదే సందనుకుని నెటిజన్లు ‘ ఎగబడ్డారు ‘.. ప్రేమకు హద్దుల్లేవని ఒకరు, లవ్ కి ఏజ్ తారతమ్యాలు లేవని మరొకరు.. ఇలా వాళ్ళు రెచ్చిపోయారు. ఇక ఇమోజీలకు, స్మైలీలకు లెక్కే లేదు.. మనం కూడా ఈ వృధ్ద జంట ప్రేమ పెళ్ళిని అభినందిద్దాం !