ఎస్‌బీఐ అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. కస్టమర్లకు పండగే!

బ్యాంకులు అందించే గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటుతో అనుసంధానించబడ్డాయి. ఆర్‌బిఐ తన సర్క్యులర్‌లో, రిటైల్ రుణ వడ్డీ రేట్లను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటుతో అనుసంధానించాలని బ్యాంకులను ఆదేశించింది. దీంతో దేశంలోనే అతి పెద్దబ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ఎస్బిఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటు (ఈబీఆర్)ను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ రేటు […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:44 pm, Mon, 30 December 19
ఎస్‌బీఐ అదిరిపోయే న్యూ ఇయర్ గిఫ్ట్.. కస్టమర్లకు పండగే!

బ్యాంకులు అందించే గృహ రుణాలపై వడ్డీ రేట్లు ఇప్పుడు ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటుతో అనుసంధానించబడ్డాయి.
ఆర్‌బిఐ తన సర్క్యులర్‌లో, రిటైల్ రుణ వడ్డీ రేట్లను ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటుతో అనుసంధానించాలని బ్యాంకులను ఆదేశించింది. దీంతో దేశంలోనే అతి పెద్దబ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు గుడ్ న్యూస్ అందించింది. తాజాగా ఎస్బిఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటు (ఈబీఆర్)ను 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీంతో ఈ రేటు 8.05 శాతం నుంచి 7.8 శాతానికి దిగొచ్చింది. ఈ తగ్గింపు 2020 జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. తాజా నిర్ణయంతో ప్రస్తుత హోమ్ లోన్స్‌పై వడ్డీ రేటు దిగిరానుంది. అలాగే ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రుణాలు తీసుకునే ఎంఎస్ఎంఈలకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు లభించనున్నాయి.

కొత్త సంవత్సరంలో హోమ్ లోన్స్ తీసుకునే వారికి 7.9 శాతం వడ్డీ రేటు వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. ఇది వరకు ఈ వడ్డీ రేటు 8.15 శాతంగా ఉంది. ఎస్‌బీఐ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత లెండింగ్ రేటు ఆర్బీఐ రెపో రేటుతో అనుసంధానమై ఉంటుంది. రెపో రేటు ప్రస్తుతం 5.15 శాతంగా ఉంది.