వొడ్కా కిక్..ఊహించని క్లిక్..ఇదేంది వర్మా..?
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనే. కాదు..కాదు అందులో ఏమైనా సంచలనం ఉంటేనే ఆయన ఆ పని చేస్తారు. ఇటీవల ‘బ్యూటిఫుల్’ సినిమా ప్రి రిలీజ్ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ నైనాతో స్టెప్పులేసిన ఆయన.. తాజాగా ఆమె కాళ్లు పట్టుకుని మరోసారి వార్తల్లోకెక్కారు. రామ్‌గోపాల్ వర్మ సమకూర్చిన కథతో తెరకెక్కిన బ్యూటిఫుల్‌ను … ట్రిబ్యూట్ టు రంగీలా అనే ట్యాగ్ లైన్‌తో రిలీజ్‌కు రెడీ చేశారు. అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో […]
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్‌వర్మ ఏం చేసినా సంచలనే. కాదు..కాదు అందులో ఏమైనా సంచలనం ఉంటేనే ఆయన ఆ పని చేస్తారు. ఇటీవల ‘బ్యూటిఫుల్’ సినిమా ప్రి రిలీజ్ కార్యక్రమంలో భాగంగా హీరోయిన్ నైనాతో స్టెప్పులేసిన ఆయన.. తాజాగా ఆమె కాళ్లు పట్టుకుని మరోసారి వార్తల్లోకెక్కారు. రామ్‌గోపాల్ వర్మ సమకూర్చిన కథతో తెరకెక్కిన బ్యూటిఫుల్‌ను … ట్రిబ్యూట్ టు రంగీలా అనే ట్యాగ్ లైన్‌తో రిలీజ్‌కు రెడీ చేశారు. అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నైనా గంగూలీ, సూరి ప్రధాన పాత్రలు పోషించారు. జనవరి 1వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆదివారం సాయంత్రం వోడ్కా విత్ వర్మ పేరిట ‘ప్రీ న్యూ ఇయర్’ ప్రైవేటు పార్టీని హైదరాబాద్‌లో వేడుకగా నిర్వహించింది. ఈ పార్టీకి అభిమానులు, సినీ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
అయితే ఇందులో భాగంగా నటినటులతో కలిసి ఆర్జీవీ డ్యాన్సులు వేశారు. దీంతో అక్కడ ఉన్న అభిమానులు ఈలలు వేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఈ సినిమా నుంచి ‘రా కసితీరా’ అనే పాటకు హీరోయిన్ నైనాతో కలిసి ఆర్జీవీ డ్యాన్స్ చేశారు. డ్యాన్స్‌లో భాగంగా ఆయన హీరోయిన్ నైనా కాళ్లుపై పడ్డారు. ఆర్జీవీ చేసిన పనికి షాక్‌కు గురైన నైనా ఒక్కసారిగా కింద కూర్చొన్నారు. దీంతో వెంటనే ఆమె ఆర్జీవీని పట్టుకుని భావోద్వేగానికి గురైయ్యారు.