Chittoor Road Accident: రక్తమోడిన నగరి రోడ్డు.. నలుగురు మృతి. 10 మందికి గాయాలు

చీకట్లో ప్రయాణం అంటేనే భయపడాల్సి వస్తోంది. ఎప్పుడు ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో చెప్పలేం. తిరుపతిలో అదే జరిగింది. తిరుపతి జిల్లా నగిరి దగ్గర ఘోర ప్రమాదం జరిగింది. తిరుపతి-చెన్నై హైవేపై తమిళనాడుకు చెందిన ఓ ప్రైవేటు బస్సు ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తున్న సమయంలో ఎదురుగా ఓ లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Chittoor Road Accident:  రక్తమోడిన నగరి రోడ్డు.. నలుగురు మృతి. 10 మందికి గాయాలు
Bus Accident
Follow us
Raju M P R

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 03, 2025 | 7:59 AM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా.. మరో 10 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. తిరుపతి చెన్నై జాతీయ రహదారిలోని నగరి ప్రభుత్వ ఆసుపత్రికి సమీపంలోనే ఈ ప్రమాదం జరిగింది. నగరి నుంచి తిరుపతికి వెళుతున్న ఒక ప్రైవేటు బస్సు.. ఓ ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్‌ టేక్‌ చేస్తున్న సమయంలో ఎదురుగా ఓ లారీ ఢీకొట్టుకుంటూ వెళ్లింది. . వేగంగా ఢీకొనడంతో బస్సులో ఒకవైపు కూర్చున్న ప్రయాణికులే ప్రమాదానికి గురయ్యారు. నలుగురు అక్కడికక్కడే మృతిచెందిగా మరికొద్దిమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో వడమాలపేట మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పార్థసారథి, రాజేంద్ర నాయుడు తోపాటు తిరుపతికి చెందిన 8 ఏళ్ల మణికంఠ తో పాటు 60 ఏళ్ల వయసున్న మరో వ్యక్తి మృతి చెందినట్లు గుర్తించారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ తమిళనాడుకు చెందిన చిన్నమలై పరిస్థితి విషమంగా ఉండగా..  క్షతగాత్రులను నగరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు.

ఘటనపై మంత్రి ఆరా…

ఇక రోడ్డు ప్రమాదం ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ప్రమాదంపై జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడిన మంత్రి రాంప్రసాద్ క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిల్ పేమెంట్ ఫీచర్..!
వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. త్వరలోనే బిల్ పేమెంట్ ఫీచర్..!
ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ..
ఓటీటీలోకి వచ్చేసిన అప్సర రాణి అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ..
ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ..
ఆ రోజు పండగ అంటే చూపిస్తాం అంటున్న డార్లింగ్ అండ్ బన్నీ..
పసిడి ధరలకు బ్రేక్.. బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
పసిడి ధరలకు బ్రేక్.. బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..
మ్యాచ్ మధ్యలో స్నిన్నర్‌గా మారిన పేస్ బౌలర్.. కట్‌చేస్తే..
మ్యాచ్ మధ్యలో స్నిన్నర్‌గా మారిన పేస్ బౌలర్.. కట్‌చేస్తే..
ఈ చిచ్చర పిడుగులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోలు
ఈ చిచ్చర పిడుగులు.. ఇప్పుడు ఇండస్ట్రీలోనే తోపు హీరోలు
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు
ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు పక్కా.. 12 రాశుల వారికి వారఫలాలు
పార్టీ ఏది పుష్పా.. 27 ఏళ్ల ఎగిరిన కాషాయజెండా.. పక్కా ప్లాన్‌తో..
పార్టీ ఏది పుష్పా.. 27 ఏళ్ల ఎగిరిన కాషాయజెండా.. పక్కా ప్లాన్‌తో..
ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి
ఈ స్టార్ హీరోయిన్‌కు ఏమైంది..!! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నటి
రెడ్ డ్రస్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం..
రెడ్ డ్రస్‌లో క్యూట్ పిక్స్ షేర్ చేసిన భాగ్యం..