AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirupati: రసవత్తరంగా మారిన తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక

తిరుపతి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. ఉప ఎన్నికలో నెగ్గాలని టీడీపీ, ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని వైసీపీ చూస్తుండటంతో కార్పొరేటర్లకు డిమాండ్ పెరిగింది. దీంతో 3 రోజులుగా తిరుపతిలో పొలిటికల్ హైడ్రామా కొనసాగుతోంది. అక్కడి నుంచి లేటెస్ట్ అప్‌డేట్స్ తెలుసుకుందాం పదండి...

Tirupati: రసవత్తరంగా మారిన  తిరుపతి డిప్యూటీ మేయర్ ఉపఎన్నిక
Tirupati Municipal Corporation
Raju M P R
| Edited By: |

Updated on: Feb 03, 2025 | 8:13 AM

Share

సోమవారం ఉదయం 11 గంటలకు తిరుపతి SV యూనివర్సిటీ సెనెట్ హాల్‌లో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. ఈ మీటింగ్‌లో డిప్యూటీ మేయర్ ఎన్నిక కోసం ఓటింగ్ జరగాల్సి ఉంది. తమ పార్టీ అభ్యర్థిగా శేఖర్ రెడ్డిని ప్రకటించిన వైసీపీ, ఆ తర్వాత లడ్డు భాస్కర్‌ను ప్రకటించింది. వైసీపీ కార్పొరేటర్లను చిత్తూరులో నిర్బంధించారన్న సమాచారం హాట్ టాపిక్ మారింది. విషయం తెలుసుకుని టీడీపీ నేతకు చెందిన భాస్కర హోటల్‌‌కు చేరుకున్నభూమన అభినయ్ హోటల్ గదుల్లోకి వెళ్లిపోయారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్పొరేటర్లను హోటల్‌ నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేశారు అభినయ్. టీడీపీ నేతలు అడ్డుకోవడంతో ఘర్షణ చోటుచేసుకుంది. కార్పొరేటర్లను తీసుకెళ్లేందుకు యత్నించిన అభినయ్ వాహనాలను అడ్డుకోవడం, వైసీపీ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారంటూ కూటమి నేతలతో వైసీపీ నేతలు వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి సుద్దుమణిగింది.

ఎట్టకేలకు వైసీపీ కార్పొరేటర్లు అభినయ్ వెంట వెళ్లారు. ఈ పరిణామాల క్రమంలో 11 గంటలకు SV యూనివర్సిటీ సెనెట్ హాల్‌లో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం జరగనుంది. మరి డిప్యూటీ మేయర్ ఎన్నిక సమావేశానికి ఏయే కార్పొరేటర్లు హాజరు అవుతారన్నదే ఇప్పుడు ఉత్కంఠ.

గతంలో డిప్యూటీ మేయర్‌గా ఉన్న భూమన అభినయ్ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయడంతో ఆ స్థానం ఖాళీ అయ్యింది. దీంతో ఇప్పుడు అక్కడ ఎన్నిక జరుగుతుంది. 50 డివిజన్‌లలో 49 డివిజన్‌లకు ఎన్నికలు జరిగితే 48 మంది వైసీపీ అభ్యర్థులే గెలుపొందారు. ఒక స్థానంలో టీడీపీ గెలిచింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఏడు ఫ్లాప్‌ల తర్వాత నాగార్జునకు హిట్ ఇచ్చిన చిత్రం ఏదో తెలుసా.?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
ఇండస్ట్రీని మార్చేస్తున్న వైరల్ వయ్యారి.. కారణం అదేనా?
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
భారత్‌పై మరోసారి జైష్-ఎ-మొహమ్మద్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు!
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మీరెప్పుడైనా కొవ్వొత్తి పువ్వులను చూశారా?.. ప్రత్యేక తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
మూత్రం రంగు మారుతోందా? ఆ వ్యాధికి సంకేతామా? ఏంటో తెలిస్తే..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
47 వయసులో ఇండస్ట్రీని ఊపేస్తున్న హీరోయిన్..
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
పళ్లు తోముకోవడానికి బ్రష్‌ నిండా టూత్‌ పేస్ట్‌ వేసుకుంటున్నారా?
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
ఫుడ్‌ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో షాకింగ్‌ విషయాలు...!
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
జియోలో కేవలం రూ.1748 రీఛార్జ్‌తో 336 రోజుల వ్యాలిడిటీ..
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్
ఘాటైన చూపుతో చంపేస్తున్న రాశి ఖన్నా.. బ్యూటిఫుల్ ఫొటోస్