N Kiran Kumar Reddy: ఢిల్లీలో బీజేపీ ప్రముఖులతో నల్లారి వరుస భేటీలు.. అమిత్ షాను కలిసిన మాజీ సీఎం..
బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా నడుపుతున్నారు. పలువురు బీజేపీ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. శనివారంనాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిశారు.

Nallari Kiran kumar Reddy: బీజేపీ తీర్థం పుచ్చుకున్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా నడుపుతున్నారు. పలువురు బీజేపీ అగ్రనేతలను మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. శనివారంనాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఆయన భేటీ అయ్యారు. జేపీ నడ్డా నివాసంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కిరణ్ కుమార్ రెడ్డి కలిశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నడ్డా నివాసంలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా, బీఎల్ సంతోష్, యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. అక్కడికి వెళ్లిన కిరణ్ కుమార్ రెడ్డి.. అమిత్ షాతో పాటు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్, యడియూరప్పలను కలిశారు.
నిన్న సాయంత్రం జేపీ నడ్డాను కలిసిన కిరణ్ కుమార్ రెడ్డి.. అమిత్ షా అపాయింట్మెంట్ కోరగా, నడ్డా నివాసానికే రావాల్సిందిగా అమిత్ షా సూచించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు శనివారం కిరణ్ కుమార్ రెడ్డి.. నడ్డా నివాసంలో అమిత్ షాతో భేటీ అయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి వెంట ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉన్నారు.
అమిత్ షాను కలిసిన కిరణ్ కుమార్ రెడ్డి..
మరిన్ని ఏపీ వార్తలు చదవండి..




