Weather Report: మండె ఎండలతో జాగ్రత్త.. వచ్చే ఐదు రోజులు భానుడి భగభగలు.
దేశంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం పూట జనాలకు రోడ్డుపైకి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది...
దేశంలో క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఏప్రిల్ నెల ప్రారంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. మధ్యాహ్నం పూట జనాలకు రోడ్డుపైకి రావాలంటే భయపడే పరిస్థితి వచ్చింది. దేశంలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా వాతావరణ శాఖ ప్రజలను అలర్ట్ చేసింది. రానున్న ఐదు రోజుల్లో దేశంలోని చాల ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది.
ఏప్రిల్ 9వ తేదీ నుంచి ఏప్రిల్ 13 తేదీ వరకు దేశంలో చాలా ప్రాంతాల్లో 4 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దేశంలోని పశ్చిమ, మధ్య, తూర్పు ప్రాంతాలతోపాటు వాయవ్యంలోని కొన్నిచోట్ల 2 నుంచి 4 డిగ్రీ సెంటీగ్రేడ్‌ల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఏప్రిల్ నుంచి జూన్ వరకు దేశంలోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది.
బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో హీట్‌వేవ్ ఉంటుందని స్పష్టం చేసింది. ఒడిశా, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ప్రస్తుతం 38 నుంచి -40 డిగ్రీల సెల్సియెస్గా నమోదవుతోంది. ఇక వాయువ్య, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాల్లో ఏప్రిల్ 13 నుంచి 19 వరకు హీట్‌వేవ్ కండీషన్ కొనసాగుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..