AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: ఇకపై వాట్సప్ ద్వారా ట్రాఫిక్ చలాన్ల పేమెంట్స్.. ఎఫ్‌ఐఆర్ సేవలు కూడా.. ఎలా అంటే..?

ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరో తీపికబురు అందించింది. వాట్సప్ గవర్నెన్స్‌లో మరిన్ని సేవలను ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ శాఖల సేవలను ప్రజలు సులువుగా పొందే సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది. తాజాగా పోలీస్ సర్వీసులను కూాాడా ఇందులో చేర్చింది.

WhatsApp: ఇకపై వాట్సప్ ద్వారా ట్రాఫిక్ చలాన్ల పేమెంట్స్.. ఎఫ్‌ఐఆర్ సేవలు కూడా.. ఎలా అంటే..?
Whatsapp Services
Venkatrao Lella
|

Updated on: Dec 22, 2025 | 8:03 AM

Share

ఏపీ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలతో ముందుకెళ్తుంది. ప్రజలకు అత్యంత వేగవంతంతగా, సులువుగా ప్రభుత్వ సేవలు అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఇంటి వద్ద నుంచే మొబైల్ ద్వారా ఈజీగా సేవలు పొందేలా టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటోంది. అందులో భాగంగా వాట్సప్ గవర్నెన్స్‌ను ప్రభుత్వం గత కొద్ది నెలల క్రితం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందుకోసం వాట్సప్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ప్రజలు ఏ ప్రభుత్వ సేవ కావాలన్నా జస్ట్ వాట్సప్ నుంచే పొందే సౌకర్యం దీని ద్వారా కల్పించింది. దీనిపై ఇంటింటికి వెళ్లి అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఎలా వాడాలనేది కూడా వివరిస్తున్నారు. దీంతో ఏపీలో దీనికి ప్రజల నుంచి అద్బుత స్పందన రావడంతో మరిన్ని సేవలను విడతల వారీగా వాట్సప్ గవర్నెన్స్‌లో అందుబాటులోకి తెస్తోంది. ఇందులో భాగంగా తాజాగా మరికొన్ని సేవలను ప్రవేశపెట్టింది. అవేంటో చూద్దాం.

తాజాగా పోలీసుల సేవలను కూడా వాట్సప్ గవర్నెన్స్‌ క్రిందకు తెచ్చింది. ఎఫ్‌ఐఆర్ నుంచి ట్రాఫిక్ చలాన్ల వరకు అన్నీ వాట్సప్ ద్వారానే పొందవచ్చు. ఎఫ్ఐఆర్ స్టేటస్, ఈ చాలాన్లను ఇందులో చెక్ చేసుకోవచ్చు. వాట్సప్ నుంచి చలాన్లను ఆన్‌లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఇక పోలీస్ చలాన్లతో పాటు రవాణాశాఖ చలాన్లు అన్నీ ఒకేచోట కనిపిస్తున్నాయి. దీని వల్ల వాహనదారులకు సులభంగా ఉంటుంది. దీంతో ఇక నుంచి మనమిత్ర వాట్సప్ ఫ్లాట్‌ఫామ్ ద్వారా పోలీస్, రవాణా సేవలను పొందాలని ప్రజలకు అధికారులు వివరించారు. ఇప్పటికే ప్రభుత్వం ఇన్ కం, రెసిడెన్షియల్, కులం లాంటి ప్రభుత్వ సర్టిఫికేట్లతో పాటు ఆర్టీసీ, దేవాలయాల్లో దర్శనం టికెట్లు బుకింగ్ లాంటివి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పొందే అవకాశం కల్పించింది. దీని వల్ల ప్రజలు ఒకేచోట అన్నీ ప్రభుత్వ సేవలు పొందుతున్నారు.

ఎలా అంటే..?

-95523 00009 నంబరును ఫోన్‌లో సేవ్ చేసుకోవాలి

-ఆ తర్వాత వాట్సప్‌లోకి వెళ్లి ఆ నెంబర్‌కు బీఖి అనే మెస్సేజ్ పెట్టాలి

-మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి

-పోలీస్ శాఖ సేవలను సెలక్ట్ చేసుకోవాలి

-ఎఫ్‌ఐఆర్, ఎఫ్‌ఐఆర్ స్టేటస్, ఈ చలాన్లు అనే మూడు ఆప్షన్లు కనిపిస్తాయి

-మీకు కావాల్సిన వాటిని సెలక్ట్ చేసుకోవాలి

-చలాన్ చెల్లించాలంటే మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి

-మీ బండిపై ఉన్న చలాన్ల వివరాలు కనిపిస్తాయి

-బ్యాంకు ద్వారా చెల్లించి రసీదు పొందవచ్చు.