assigned lands: అనంత ఫోర్జరీలో అందరూ దొంగలే..! కోట్లు విలువైన భూములపై రియల్టర్ల కన్ను..

అనంతపురం నగర సమీపంలో కోట్లు విలువ చేసే భూమి పై కొందరు రియల్టర్ల కన్ను పడింది. అసైన్డ్ భూమిగా ఉన్న దానిని ఎన్ఓసీ తీసుకుని సక్రమం చేసేందుకు ఏకంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలనే ఫోర్జరీ చేశారు. అయితే చివరి క్షణంలో..

assigned lands: అనంత ఫోర్జరీలో అందరూ దొంగలే..! కోట్లు విలువైన భూములపై రియల్టర్ల కన్ను..
Land
Follow us
Jyothi Gadda

|

Updated on: May 30, 2022 | 2:32 PM

అనంతపురం నగర సమీపంలో కోట్లు విలువ చేసే భూమి పై కొందరు రియల్టర్ల కన్ను పడింది. అసైన్డ్ భూమిగా ఉన్న దానిని ఎన్ఓసీ తీసుకుని సక్రమం చేసేందుకు ఏకంగా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సంతకాలనే ఫోర్జరీ చేశారు. అయితే చివరి క్షణంలో అధికారులు గుర్తించడంతో అసలు వ్యవహరం వెలుగులోకి వచ్చింది.

అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజులుగా రెవెన్యూ విభాగంలో జరుగుతున్న వ్యవహారాలు చాలా వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా ఎన్ఓసీ కోసం ఏకంగా కలెక్టర్, ఆర్డీఓ సంతకాలనే ఫోర్జరీ చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కూడేరు మండలం కమ్మూరు గ్రామ సర్వే నంబర్‌ 525, 526లో 34.86 ఎకరాల భూమి ఉంది. దీనికి 1954వ సంవత్సరంలోనే డి.పట్టా మంజూరైంది. ఈ భూమిని ఇటీవల అనంతపురం ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి కొని.. అగ్రిమెంట్‌ చేసుకున్నాడు. అతను వేరే వ్యక్తికి అమ్మాలనుకుని.. ఎన్‌ఓసీ కోసం దరఖాస్తు చేశాడు. దానిపై తహసీల్దార్, ఆర్డీఓ సంతకాలు పూర్తయ్యాయి. జేసీ, కలెక్టర్‌ సంతకాలు చేయాల్సి ఉంది. కానీ అంతలోనే సదరు వ్యక్తి ఓ రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే కంప్యూటర్‌ ఆపరేటర్‌ను ఆశ్రయించి పని త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరాడు. దీంతో కంప్యూటర్‌ ఆపరేటర్‌ కలెక్టర్, జేసీ సంతకాలను ఫోర్జరీ చేసి నకిలీ ఎన్‌ఓసీ సృష్టించి అతనికి అందజేశాడు.

ఇవి కూడా చదవండి

అయితే త్వరగా ఎన్ఓసీ రావడంతో పాటు.. కొన్ని అనుమానాలు రావడంతో కలెక్టర్ కు విషయం చేరింది. వెంటనే కలెక్టర్‌ పరిశీలించి అక్కడ సంతకాలు ఫోర్జరీ అయినట్టు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టి ఏం జరిగిందో వివరణ ఇవ్వాలని అనంతపురం ఆర్డీఓ మధుసూదన్‌ను ఆదేశించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ సిబ్బంది పాత్ర ఉన్నట్టు అర్థమవుతోంది. కూడేరు మండలంలోని రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ కార్యాలయంలో ఒక ఉద్యోగి.. అలాగే కలెక్టరేట్ లో మరో ఉద్యోగి, నగరంలోని ఓ మీసేవా నిర్వాహాకుడు, పుట్టపర్తికి చెందిన ఒక కంప్యూటర్ ఆపరేటర్ ఇలా చాలా మంది పాత్ర ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై సమగ్రమైన విచారణ చేస్తున్నట్టు ఆర్డీఓ మధుసూదన్ తెలిపారు. జిల్లాలో కలెక్టర్, జేసీ సంతకాలు ఫోర్జరీ కావడం సంచలనం రేపింది. గతంలో కూడా ఇలాంటివి ఏమైనా చేశారా అన్న కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.