భర్త బతికుండగానే భార్య వైధవ్యం..! మూడు నెలలకో మరణం..అది 23నే..! అనంత గందరగోళం..

ముత్తైదువగా ఉండాల్సిన ఓ మహిళ తన మెడ‌లోని మంగ‌ళసూత్రం తీసేసింది. కాలి మెట్టెలు తొల‌గించి, నుదుట బొట్టును చెరిపేసింది. నెల‌ల త‌ర‌బ‌డి త‌న‌కు తాను వైధ‌వ్యాన్ని స్వీక‌రించింది. అలాగని ఇంటిని నుంచి ఎక్క‌డికీ వెళ్లిపోలేదు. భ‌ర్త‌, బిడ్డ‌ల‌తో క‌లిసే ఉంటోంది.

భర్త బతికుండగానే భార్య వైధవ్యం..! మూడు నెలలకో మరణం..అది 23నే..! అనంత గందరగోళం..
Bharya Nirnayam
Follow us

|

Updated on: May 30, 2022 | 1:56 PM

ముత్తైదువగా ఉండాల్సిన ఓ మహిళ తన మెడ‌లోని మంగ‌ళసూత్రం తీసేసింది. కాలి మెట్టెలు తొల‌గించి, నుదుట బొట్టును చెరిపేసింది. నెల‌ల త‌ర‌బ‌డి త‌న‌కు తాను వైధ‌వ్యాన్ని స్వీక‌రించింది. అలాగని ఇంటిని నుంచి ఎక్క‌డికీ వెళ్లిపోలేదు. భ‌ర్త‌, బిడ్డ‌ల‌తో క‌లిసే ఉంటోంది. ఈ ప్రవర్తనే ఆ ఊరి జనానికి అనుమానం అనే బీజాన్ని నాటింది..ఆమె అలా చేసినందుకు ఊరికి అరిష్టం ప‌ట్టుకుంద‌ని జ‌నంలో భ‌యం ప‌ట్టుకుంది. గ‌త కొన్ని నెల‌లుగా ఆ ఊరిలో సంభ‌విస్తున్న అకాల మ‌ర‌ణాలే.. కార‌ణం ఈమె ప్రవర్తనే అని ఘాడంగా మూఢంగా నమ్ముతున్నారు. ఊరి పెద్ద‌లు చెప్పినా ఆమె వినిపించుకోలేదు. దీంతో ఊరి జ‌నం పోలీసుల‌ను క‌లిశారు. త‌మ ఊరిని కాపాడాల‌ని మొర పెట్టుకున్నారు. వారి అమాయ‌కత్వాన్ని చూసిన పోలీసులు.. స‌రే.. అని ఆ ఊరికి వెళ్లారు. ఆ తర్వాతం ఏం జరిగింది..?

అనంత‌పురం జిల్లా గుత్తి మండల ప‌రిధిలోని ఆ ఊరి పేరు పి. ఎర్ర‌గుడి. మండ‌ల కేంద్రానికి సుమారు 15 కి.మీ. దూరంలో ఉంటుంది. ఆ ఊరిలో ప్ర‌తి మూడు నెలలకు ఓ మారు ఎవరో ఒకరు అకారణంగా చనిపోతున్నారట. అదీ.. 23వ తేదీనే చ‌నిపోతున్నార‌ట‌. ఇదే ఊరిలో ఓ మ‌హిళ త‌న భ‌ర్త‌తో కొన్నేళ్లుగా గొడ‌వ ప‌డుతోంది. ఆయన బతికుండగానే బొట్టు, గాజులు, తాళి తీసేసింది. ఈ కారణంగానే ఊరిలో అరిష్టం, అకాల మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయ‌ని ఆ ఊరి జ‌నం న‌మ్ముతున్నారు. ఈ మూఢ నమ్మకం ఏకంగా ఆ ఊరి జనాన్ని గుత్తి పోలీస్‌ స్టేషన్‌ తలుపు తట్టేలా చేసింది. సుమారు ఐదు వందల కుటుంబాలు ఉండే ఆ ఊరిలో గడిచిన తొమ్మిది నెలల్లో ఎనిమిది మంది మరణించారు. ఈ మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మేమిటో వైద్యుల‌ను అడిగితే స‌రిపోయేది. కానీ ఓ పూజారిని సంప్రదించారు. తమ ఊరికి ఏదో అయ్యింద‌ని, ఉన్నఫలంగా కొందరు చనిపోతున్నారని ఆయన వద్ద మొర పెట్టుకున్నారు. ఆ మహిళ కార‌ణంగానే ఇలా జ‌రుగుతోంద‌ని పూజారి కూడా చెప్పార‌ట‌. దీంతో ఊరి పెద్ద‌లు ఆమెకు న‌చ్చ‌జెప్ప‌బోయారు. భ‌ర్త ఉండ‌గా అలా వైధవ్యం పాటించ‌డం మంచిది కాద‌ని అన్నారు. కానీ ఆమె వినిపించుకోలేదు. ఒత్తిడి చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు దిగింది. దీంతో ఊరి పెద్ద‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఆమె కారణంగా తమ ఊరికి చెడు జరుగుతోందని, ఎలాగైనా త‌మ ఊరిని కాపాడాల‌ని కోరారు. దీంతో పోలీసులు గ్రామానికి వెళ్లారు. ఆమెను క‌లిసి ఎందుకిలా చేస్తున్నావ‌ని పోలీసులు ప్రశ్నించారు. భ‌ర్త‌పై కోపంతో తానిలా చేశానని చెప్పింది. ఊరి జనం మాట వినాలని పోలీసులు ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో వైధ‌వ్యాన్ని వీడేందుకు ఆమె అంగీక‌రించింది. ఊరి జనం కూడా సంయమనం పాటించాలని, ఈ విషయమై గొడవలకు దిగొద్దని పోలీసులు సూచించారు.

ఇవి కూడా చదవండి

విశ్వంలోని అంతుచిక్కని రహస్యాలు శోధిస్తు ముందుకు దూసుకెళ్తున్న ఈ ఆధునిక యుగంలో శాస్త్రీయ దృక్ఫథం కొర‌వ‌డిన ఆ ఊరి ప్ర‌జ‌ల‌కు వైద్యులు, అధికారులు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంది. ఆ ఊరిలో అకాల మ‌ర‌ణాల‌కు కార‌ణాలేమిటో గుర్తించి, వారిలో ఉన్న భ‌యాన్ని తొల‌గించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉందని పలువురు సూచిస్తున్నారు.

Latest Articles